వీరభద్రం దర్శకత్వంలో బన్నీ?
వీరభద్రం దర్శకత్వంలో బన్నీ?
Published Mon, Aug 26 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తారని, తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో నటిస్తారని రకరకాల వార్తలు సినీవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వీరభద్రం దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార నే తాజా వార్త ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి... ప్రస్తుతం నాగార్జునతో ‘భాయ్’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారాయన.
‘భాయ్’ తర్వాత బన్నీ-వీరభద్రంల సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని విశ్వసనీయ సమాచారం. సదరు నిర్మాత.. వీరభద్రానికి అడ్వాన్స్ కూడా అందజేసినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు వీరభద్రం... బన్నీతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే...
Advertisement
Advertisement