లావిష్‌గా రేసుగుర్రం
‘డెక్కల తాకిడికి... దుమ్ము రేగిపోవాల్సిందే, ప్రత్యర్థులు మట్టి కరవాల్సిందే’ అన్నట్టుగా ఉంది ఇటీవల విడుదలైన ‘రేసుగుర్రం’ టీజర్. రేసుగుర్రాన్ని తలపించే బన్నీ పరుగు... ఈ టీజర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్. హాలీవుడ్ సినిమాలను తలపించేలా సురేందర్‌రెడ్డి లావిష్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ని చూస్తే అర్థమైపోతోంది. నేటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో జరగనుంది. ఈ నెల 11 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో ఒక ఐటమ్ సాంగ్‌ని, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది.
మిగిలిన చివరి పాట చిత్రీకరణ ఈ నెల 20 నుంచి 25 వరకూ జరుగుతుంది. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ మేలిమలుపుగా ఈ చిత్రం నిలు స్తుందని యూనిట్‌వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు.