Published
Tue, Aug 16 2016 11:55 PM
| Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
స్పందించిన హృదయాలు
విశాఖపట్నం : మాట్లాడడానికి ఓపిక లేదు...బక్కచిక్కిన శరీరం..ముడతలు పడిన చర్మం...కళ్లు మూతలు పడుతున్నాయి..ఓపిక తెచ్చుకుని ఎవరైనా గుక్కెడు నీళ్లు పోస్తారా?అని ఎదురుచూస్తుందే తప్పా మాట బయటకు రావడం లేదు. ఇలా వారం రోజులు.. మలమూత్రవిసర్జన జరుగుతున్నా స్పృహ లేదు. పాపం ఆ తల్లికి ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్లో...! నా అన్న వాళ్లు వదిలేశారా? ఏ దిక్కూ లేక ఇలా కూలబడిపోయిందా?? కారణం ఏదైతేనేం ఆ మాతమూర్తి కష్టమిది. ఆర్‌పీఎఫ్ క్యాంపు ఆఫీసు దరిలో దీనస్థితిలో ఉన్న 80 ఏళ్ల బామ్మను జీఆర్‌పీఎఫ్ సిబ్బంది గమనించారు. చలించిపోయారు. వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ విభాగంలోని ఐసీపీఎస్ సిబ్బందికి, సాతి సంస్థ, ఆత్రేయ ఓపెన్ షెల్టర్ ప్రతినిధులు సమాచారమందించారు. వారంతా చేరుకుని బామ్మకు స్నానం చేయించి. వస్త్రాలు కట్టి..అల్పాహారం అందజేశారు. ప్రాణం లేచి వచ్చినట్టు బామ్మ కళ్లలో ఆనందం చూశారు వీరంతా...అనంతరం అక్కడ నుంచి కాంప్లెక్స్ దరిలో ఉన్న ఆత్రేయ ఓపెన్ షెల్టర్‌కు తరలించారు. మనసున్నోళ్లని నిరూపించారు.