ఒక్క ఛాన్స్ కోసం.. ఎంత కష్టపడాలో | Outsiders struggle for just one chance in Bollywood: Kirti | Sakshi
Sakshi News home page

ఒక్క ఛాన్స్ కోసం.. ఎంత కష్టపడాలో

Published Mon, Jun 20 2016 5:54 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

ఒక్క ఛాన్స్ కోసం.. ఎంత కష్టపడాలో - Sakshi

ఒక్క ఛాన్స్ కోసం.. ఎంత కష్టపడాలో

ముంబై: చిత్రపరిశ్రమతో సంబంధంలేని తనలాంటి వారికి సినిమాల్లో నటించేందుకు ఒక్క అవకాశం రావాలంటే ఎంతో కష్టపడాలని బాలీవుడ్ నటి కృతీ కుల్హారి చెబుతోంది. సినిమాల్లో నటించేందుకు  అవకాశం వచ్చినా, ప్రతిభను నిరూపించుకుంటేనే మళ్లీ అవకాశాలు వస్తాయని, లేకుంటే సినిమాల్లో కొనసాగడం కష్టమని వెల్లడించింది. వారసుల పిల్లలకు అయితే సులభంగా అవకాశాలు వస్తాయని, తనలాంటి వారి పరిస్థితి పూర్తిగా భిన్నమని వెల్లడించింది. ’ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా ప్రతిభను చూడండి’ అన్నట్టుగా తాపత్రయపడతారని చెప్పింది.

తనకు సినిమాల్లో నటించే అవకాశం రాకుంటే చాలామందిలా అనామకురాలిగా ఉండేదాన్నని కృతి పేర్కొంది. కిచ్డీ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన కృతికి ’పింక్’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో కలసి నటించే అవకాశం వచ్చింది. అమితాబ్తో కలసి నటించడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నానని, దాన్ని మాటల్లో చెప్పలేనని అంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement