Outsiders
-
జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన తాప్సీ
Taapsee Pannu Turns Producer: కథానాయికలు నిర్మాతలుగా మారడం ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. మొన్న అనుష్క శర్మ, నిన్న ప్రియాంక చోప్రా నిర్మాతలుగా మారి సినిమాలు తీసి హిట్టందుకోగా తాజాగా తాప్సీ పన్ను కూడా సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టింది. "అవుట్‌సైడర్ ఫిలింస్" పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. సూర్మా, పీకు వంటి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రంజల్ ఖాందియాతో కలిసి తన సంస్థ నుంచి సినిమాలు తీయనున్నట్లు వెల్లడించింది. తప్పకుండా మంచి కంటెంట్‌తో ముందుకు వస్తానంటూ సోషల్ మీడియా వేదికగా గురువారం నాడు అభిమానులకు హామీ ఇచ్చింది తాప్సీ. నిర్మాతగా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నానని ఇందుకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ ఎమోషనల్ లేఖ రిలీజ్ చేసింది. అయితే ఆమె తన నిర్మాణ సంస్థకు 'అవుట్‌సైడర్ ఫిలింస్' అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ 'అవుట్‌సైడర్స్', 'నెపోటిజం' పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అవుట్‌సైడర్స్(బయటివాళ్ల)కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వరని, సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినవాళ్లను మాత్రం అందలం ఎక్కిస్తారని విమర్శలు వస్తుంటాయి. ఈ క్రమంలో తాప్సీ అవుట్ సైడర్ అనే పేరును ఎంచుకోవడాన్ని చూస్తుంటే ఆమె కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. #OutsiderFilms #NewChapter pic.twitter.com/0DPmjaOAIN — taapsee pannu (@taapsee) July 15, 2021 New beginnings! #OutsidersFilms #NewChapter pic.twitter.com/oOPLT4iWaO — taapsee pannu (@taapsee) July 15, 2021 -
రవీంద్రుడి గడ్డపై పరాయివారు ఉండరు
కాంథీ(పశ్చిమబెంగాల్): వందేమాతరం అంటూ దేశాన్ని ఒక్కటి చేసిన నేల పశ్చిమబెంగాల్ అని, అలాంటి గడ్డపై ‘పరాయివారు’ అనే మాటలు వినిపిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్థానిక నాయకుడినే సీఎం చేస్తామని మోదీ తెలిపారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంథీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి నందిగ్రామ్‌లో మమతపై పోటీ చేస్తున్న సువేందు అధికారి కుటుంబానికి కాంథీ ప్రాంతంలో గట్టి పట్టుంది. మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలను బెంగాల్‌కు పరాయివారంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పరాయివారు పాలించడాన్ని బెంగాలీలు అంగీకరించబోరని మమత ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలను ఎన్నికల పర్యాటకులుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు జన్మించిన బెంగాల్ గడ్డపై భారతీయులెవరూ పరాయి వారు కావని మోదీ వ్యాఖ్యానించారు. ‘మమ్మల్ని టూరిస్ట్‌లంటున్నారు. అవహేళన చేస్తున్నారు. రవీంద్రుడి బెంగాల్లో ప్రజలు ఎవరినీ పరాయివారుగా చూడరు’ అని పేర్కొన్నారు. దాడి చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసి నందిగ్రామ్ ప్రజలను మమత బెనర్జీ అవమానపర్చారని మోదీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పథకాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లో హింస, బాంబులు, తుపాకీల సంస్కృతిని రూపుమాపుతామన్నారు. ‘ఇంటి ముందుకు ప్రభుత్వం’ అని మమత ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న ఆమె అధికారం కోల్పోయి ఇంటికి వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రానికి చీకటినే మిగిల్చిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో రాష్ట్రాన్ని బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. -
వాళ్లే ‘పరాయి శక్తులు’!
బిష్ణుపుర్: రాబోయే ఎన్నికల్లో సమస్యలు, అరాచకం సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతైనవాళ్లనే తమ పార్టీ ‘బయట వ్యక్తులు’(అవుట్‌సైడర్స్)గా అభివర్ణించిందని, తరాలుగా బెంగాల్లో జీవనం గడుపుతున్న ఇతర రాష్ట్రాల ప్రజలను కాదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వివరించారు. బెంగాల్లో జీవించేందుకు భారత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లంతా తమ దృష్టిలో స్థానికులేనన్నారు. బీజేపీని అవుట్‌సైడర్స్ పార్టీ అంటూ టీఎంసీ విమర్శించడం తెల్సిందే. ఈ నినాదం రాష్ట్రంలో నివాసముండే ఇతర రాష్ట్రాలవారిపై ప్రభావం చూపవచ్చన్న అంచనాతో మమత తాజాగా వివరణ ఇచ్చారు. ‘‘తరాలుగా ఇక్కడే ఉంటున్నవారిపై బయటవారనే ముద్ర ఎందుకు? వారు బెంగాల్లో భాగం, కేవలం యూపీలాంటి రాష్ట్రాల నుంచి ఎన్నికలు చెడగొట్టేందుకు వచ్చిన అల్లరిమూకలనే మేము బయటి శక్తులుగా భావిస్తాం’’ అని మమత చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇలాంటి బయట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారిని దునుమాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్, సీపీఎంపైన కూడా ఆమె నిప్పులు చెరిగారు. మైనార్టీలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లను చీల్చడం ద్వారా ఈ పార్టీలు బీజేపీకి లబ్ది చేకూరుస్తాయని విమర్శించారు. ప్రధాని కుర్చీపై తనకు అమిత గౌరవం ఉందని, కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అతిపెద్ద అబద్ధాలకోరని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేసే హామీ ఏమైందని ప్రశ్నించారు. -
మూడు సినిమాల నుంచి తప్పించారు
‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర. ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు. క్యాస్టింగ్ కౌ^Œ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి. -
ఇక్కడ మాఫియా లేదు
ప్రస్తుతం బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి), అవుట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు) అండ్ ఇన్సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు) అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా మాట్లాడుతూ– ‘‘అవుట్‌సైడర్స్, ఇన్సైడర్స్ గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోందో అర్థం కావడంలేదు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. నేనెందుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. 40–45 ఏళ్లుగా నేను నటుడిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా నట వారసుడిగా నా కొడుకును నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక బిజినెస్‌మేన్, లాయర్, డాక్టర్ ఎవరైనా తమ వారసులను తమ రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు. దీనికి మాఫియా అని, బంధుప్రీతి అని పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నా కొడుక్కి అవకాశం రావడం సహజం. అయితే తనకు టాలెంట్ ఉంటేనే అవకాశం ఇస్తారు. కాకపోతే మొదట అవకాశం ఈజీ అవుతుంది. బయటినుండి వచ్చేవారికి ఆ ఛాన్స్ ఉండదు. అయితే అవకాశం తెచ్చుకుని, ప్రతిభ నిరూపించుకుంటే వారసులకన్నా కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి రికమండేషన్‌తో ఓంపురి ముంబైలో అడుగుపెట్టారు. ఎవరు రికమండ్ చేశారని నాకు అవకాశాలు వచ్చాయి. మేమంతా ఒంటరిగా పైకొచ్చినవాళ్లమే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాఫియా అని కొందరు కథలు అల్లుతున్నారు. అందులో వాస్తవం లేదు. 45 ఏళ్లుగా నేనిక్కడే ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడ మాఫియా లేదు’’ అన్నారు. -
అందర్నీ ఒకేలా చూడాలి!
‘‘అవకాశాల విషయంలో అందర్నీ సమానంగానే చూడాలి. ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ అని వేరుగా చూడకూడదు’’ అంటున్నారు సీరత్ కపూర్. ప్రస్తుతం బంధుప్రీతి (నెపోటిజమ్), ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్ అనే చర్చ బాలీవుడ్లో తీవ్రంగా నడుస్తోంది. ఈ విషయం మీద ‘రన్ రాజా రన్, కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘నెపోటిజమ్ ఏ పరిశ్రమలో అయినా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. అది సహజం. కాదనలేం కూడా. కానీ అవకాశాల విషయంలో సమాన న్యాయం ఉండాలి. ప్రతిభను బట్టే అవకాశం ఇవ్వాలి. కేవలం స్టార్ కిడ్స్ మాత్రమే కాకుండా ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరినీ నిజాయతీగా ప్రోత్సహించాలి. వారసులను, బయటినుంచి వచ్చేవాళ్లను ఒకేలా చూడాలి. అలాంటి వాతావరణం ఏర్పడేలా చేసే బాధ్యత అందరి మీదా ఉంది’’ అన్నారు సీరత్. ‘ప్రస్తుతం ‘మా వింత గాధ వినుమ’ అనే సినిమాలో నటిస్తున్నారు సీరత్. -
అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!
‘‘నెపోటిజమ్ కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు.. ప్రతి పరిశ్రమలోనూ ఉంది. అలానే బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. బాలీవుడ్ ఒక ఫ్యూడల్ వ్యవస్థలా పని చేస్తోంది’’ అన్నారు హిందీ నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు స్వర. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్’ అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు స్వరా భాస్కర్. ‘‘నెపోటిజమ్ గురించి అందరూ ఎలా అనుకుంటారంటే... ఒక్క సినిమాలో స్టార్ కిడ్ని పరిచయం చేస్తే చాలు వాళ్ల కెరీర్ సెట్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ అలా జరగదు. ప్రతీ సినిమాకి కష్టపడాలి. నిరంతర కృషే మనల్ని స్టార్‌గా నిలబెడుతుంది. అవుట్‌సైడర్‌గా ఉంటూ స్టార్ కిడ్స్ పరిస్థితి చూస్తే జాలిగా అనిపిస్తుంటుంది. వాళ్ల ఒత్తిడి, వాళ్ల మీద ఉండే అంచనాలు అలాంటివి. కానీ వాళ్లకు ఉండే అవకాశాలు తక్కువేం కాదు. అవుట్‌సైడర్‌గా మాకు కష్టంగా అనిపించే విషయాలు వాళ్లకు చాలా సులువుగా జరిగిపోతాయి. అయితే మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రస్తుతం చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ‘వీళ్లు టాలెంట్‌తోనే ఎదిగారు’ అనే పేరు స్టార్ కిడ్స్‌తో పోల్చుకుంటే.. అవుట్‌సైడర్స్‌కి త్వరగా ఏర్పడుతుంది. అదే అవుట్‌సైడర్స్‌కి ప్లస్’’ అన్నారు. బాలీవుడ్లో ఉండే పోటీ గురించి చెబుతూ– ‘‘సినిమా అనేది పెద్ద పోటీ ప్రపంచం. నిరంతరం ఎవరో ఒకరితో మనం మనకు తెలిసోతెలియకో పోటీ పడుతూనే ఉంటాం. బయట చాలా మంది స్టార్ కిడ్స్‌కి చాలా పొగరు, వాళ్ల పవర్‌ను ఇతరుల మీద రుద్దాలనుకుంటారు అని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో నేను రెండు రకాల వాళ్లతో (ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్) పని చేశా. ఎదుటివారితో చాలా చక్కగా ప్రవర్తించి, కష్టపడే మనస్థత్వం ఉన్నవాళ్లు, టైమ్ విషయంలో కచ్చితంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఇన్సైడర్సే. కొందరు అవుట్‌సైడర్స్ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకొని వాళ్ల స్టార్ స్టేటస్‌ను దుర్వినియోగం చేయడం గమనించాను. ఇది నేను ఎవ్వర్నీ ఉద్దేశించి చెప్పడం లేదు. నా అనుభవం ద్వారా చెబుతున్నాను. స్టార్‌డమ్‌ను దుర్వినియోగం చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు’’ అని వివరించారు స్వరా భాస్కర్. -
ఎవరీ గ్యాంగ్?
బయటకే తళుకులు.. లోపలంతా చీకటి రాజకీయాలే ప్రతిభకు పోటు నెపోటిజం అవుట్‌సైడర్స్‌కు తిప్పలు తప్పవు ఈ మధ్య బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న విమర్శలివి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ, ప్రశాంతంగా కనిపించే ఏ ఆర్ రెహమాన్ ‘నాకు హిందీ సినిమాలు రానీకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోంది’ అని ఆరోపించడం సంచలనం అయింది. ఇంతకీ ఎవరీ గ్యాంగ్? ఈ గ్యాంగ్ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ఇక రెహమాన్ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయనకు మద్దతుగా స్పందించినవారి గురించి తెలుసుకుందాం. రెహమాన్ బిజీ కంపోజర్. ఎప్పుడూ నాలుగైదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటాయి. అయితే హిందీలో మాత్రం తక్కువ సినిమాలు చేస్తున్నారు. అది ఆయన అంతట తగ్గించింది కాదు తగ్గించబడింది అట. ‘హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నారెందుకు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు. ‘నాకు సినిమాలు రాకుండా బాలీవుడ్ లో కొందరు గ్రూపిజమ్ చేస్తున్నారు. ట్యూన్స్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తానని, ఇలా మరికొన్ని అవాస్తవమైన వార్తలు నా మీద çసృష్టించారు. నాకు సినిమాలు రానివ్వకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోంది’’ అని తెలిపారు రెహమాన్. ఆస్కార్ విజేత రెహమాన్‌కి కూడా ఇలా అవుతుందా? అని షాకయ్యారందరూ. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రెహమాన్‌కే ఇలా జరిగితే ఇక వేరేవాళ్ల పరిస్థితేంటి? అనే చర్చకు దారితీసింది. గ్రూపిజమ్, ఫేవరెటిజమ్ తో నచ్చినవాళ్లకు పని కల్పిస్తూ ఇష్టారాజ్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. రెహమాన్‌కి మద్దుతుగా పలువురు ప్రముఖులు స్పందించారు. ‘‘ఏది ఏమైనా నా పని నేను చేసుకుంటూ ఉంటాను’’ అని రెహమాన్ ట్వీట్ చేశారు. ‘డబ్బు పొతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పొతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృ«థా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడదాం’’ అని కూడా అన్నారు రెహమాన్. బాలీవుడ్ గురించి కొందరి మాటలు విన్నాక గ్యాంగ్ కుట్రలు, గ్రూపిజాలు ఉన్నాయని అర్థమవుతోంది. మరి.. ఇవి ఎలా ఆగుతాయి? ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకునే వాతావరణం ఏర్పడుతుందా? బంధుప్రీతి, గ్యాంగ్.. వంటి వివాదాలేనా? రేపు మరో కొత్త వివాదానికి తెరలేస్తుందా? ప్రస్తుతం బయట ఉన్నట్లే బాలీవుడ్ లో అంతా అనిశ్చితి! ‘రెహమాన్ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు శేఖర్ కపూర్. – శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ‘‘రెహమాన్ కి కేవలం హాలీవుడ్ సినిమాల మీదే ఆసక్తి ఉందని, బాలీవుడ్ సినిమాలు చేసే ఆసక్తి లేదని మొదటి నుంచి అతని మీద ఆరోపణలు వేస్తూనే ఉన్నారు. దాంతో చాలామంది దర్శకులు ఆయనకు ఆసక్తి లేదేమో అనుకుని ఉండుంటారు. కానీ ఆయనతో పని చేయాలనుకునేవారు ఆయనతో పని చేస్తూనే ఉన్నారు. – రియానా, రెహమాన్ సోదరి. నాకూ ఇలానే జరిగింది! ‘‘ఆస్కార్ గెలిచిన తర్వాత బాలీవుడ్ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ సినిమాల అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం’’ – రెసూల్ పూకుట్టి, సౌండ్ డిజైనర్. మీకు పరిమితులు లేవు. మీరు కేవలం బాలీవుడ్ కాదు. అంతకు మించి. మీరు కంపోజ్ చేసిన పాటల్ని వినడానికి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం. – శ్వేతా మోహన్, గాయని. రెహమాన్ లాంటి నమ్మదగ్గ మనిషి మాట్లాడినప్పుడే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని అందరికీ అవగాహన వస్తుంది. థ్యాంక్యూ సార్. – మీరా చోప్రా, నటి. నెపోటిజం (బంధుప్రీతి) టాపిక్ మీద ఇటీవల నేషనల్ మీడియాలో తరచూ కనిపిస్తున్న కంగనా కూడా ఈ విషయం మీద మద్దతుగా మాట్లాడారు. ’’ఈ (బాలీవుడ్) ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా వేధింపులకు గురవుతారు. మరీ ముఖ్యంగా స్వతంత్రంగా పని చేద్దాం అనుకునే వాళ్లు’’ అన్నారు కంగనా. – కంగనా, నటి -
నిరూపించుకునే అవకాశమివ్వండి
‘‘ఫలానా పాత్రను చేసే సామర్థ్యం నటిగా ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల కుడా అవకాశాలు చేజారుతుంటాయి. కేవలం ‘అవుట్ సైడర్స్’ అనే కారణం వల్ల’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ‘మళ్ళీ రావా’, ‘దేవదాస్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారామె. ఇటీవలే కన్నడంలో సుదీప్తో ‘పెహల్వాన్’లోనూ కనిపించారు. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న నెపోటిజం, అవుట్ సైడర్స్ వాదనలో భాగంగా ఆకాంక్షా సింగ్ కూడా తన అభిప్రాయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘కొన్నిసార్లు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ రోల్ లో కనిపించాలని ఉంటుంది, ఆ పాత్రకు మనం న్యాయం చేయగలం అనే నమ్మకం కూడా ఉంటుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల మనల్ని మనం నిరూపించుకోవడానికి వీలున్న అవకాశాలు రావు. అతిథి పాత్రకో, సహాయ నటి పాత్రలకో మాత్రమే మేం గుర్తొస్తాం. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, పెద్ద పెద్ద వాళ్ల తో పరిచయాలు లేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీ సర్కిల్ (వారసులను ప్రోత్సహించేవారిని ఉద్దేశించి అయ్యుండొచ్చు) దాటి వస్తేనే వాళ్లు మీకు కనిపిస్తారు. ప్రస్తుతం చాలా మంది నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇదే. ఇక నటిగా నా గురించి చెప్పాలంటే.. మొదటి నుంచి కూడా నా టాలెంట్ మీద, నా మీద నాకు నమ్మకం ఎక్కువ. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ సందర్భంగా దర్శకులకు, నిర్మాత (హిందీ)లకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం (ప్రతిభను నిరూపించుకునే అవకాశం) ఇచ్చి చూడండి. నన్ను నేను నిరూపించుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టితో ‘క్లాప్’ చిత్రంలో నటిస్తున్నారు ఆకాంక్షా సింగ్. -
‘తాజ్’లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి
న్యూఢిల్లీ: తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల వారు ఆగ్రాలో ప్రార్థనలు చేసుకోవడానికి వేరే మసీదులు ఎన్నో ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది. -
గుండాగిరి.. కర్రలు విరిగేలా చావుదెబ్బలు
సాక్షి, ముంబయి : మహారాష్ట్రలో మరోసారి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు గుండాగిరికి దిగారు. మరాఠేతరులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ పార్టీ జెండాలు విరిగిపోయేలా వారిని చావు దెబ్బలు కొట్టారు. తమ ప్రాంతంలో ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారని జులుం ప్రదర్శిస్తూ చెలరేగిపోయారు. సంగ్లీ పరిధిలోని కుప్వాడ్ ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పలువురు మహారాష్ట్రేతరులు పనిచేస్తుంటారు. వారి సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది. ఎన్నో పరిశ్రమలు, తయారీ యూనిట్లు, ఫ్యాక్టరీలు, మిల్లులు ఉన్న ఇక్కడ మహారాష్ట్రేతర్లు చాలామంది ఉంటారు. అయితే, వారు ఇక్కడ పనిచేయొద్దని స్థానికులు మాత్రమే ఉండాలని, ఉద్యోగాలు ఇచ్చే వారు కూడా స్థానికులకే ఇవ్వాలని నినాదాలు ఇస్తూ ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచారు. తమ ప్రాంతాల్లో నేరాలు జరగడానికి కారణం వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారేనని వారు ఆరోపించారు. స్థానికుల ఉద్యోగాలను స్థానికేతరులు దోచుకెళుతున్నారని మండిపడ్డారు -
వెల్లింగ్టన్ లో వింత సమస్య!
వెల్లింగ్టన్ : న్యూజిల్యాండ్ లోని ఓ పట్టణం వింత సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే.. అక్కడ మాత్రం ఉద్యోగాలు చేసేవారు లేక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు ఫుల్ గా ఉన్నా అభ్యర్థులు లేకపోవడం ఆ సిటీలో పెద్ద సమస్యగా మారిపోయింది. అంతేకాదు అక్కడ ఉన్న ఇళ్ళలో కూడ ఎవరూ నివసించేందుకు ముందుకు రావడం లేదట. న్యూజిల్యాండ్ క్లుతా జిల్లా, కైటంగట పట్టణంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు బదులుగా అభ్యర్థుల కొరత బాధిస్తోందట. ప్రపంచంలో ఎన్నోదేశాలు ఎదుర్కొంటున్న సమస్యకు భిన్నంగా అక్కడి ప్రభుత్వం.. ఉద్యోగులు కావాలంటూ ఎదురు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతి చిన్న పట్టణమైన కైటంగటలో కేవలం 800 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు అత్యధికంగా ఉండటంతో ప్రభుత్వం అభ్యర్థులకోసం పడిగాపులు పడాల్సివస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తామని ముందుకొచ్చేవారికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇల్లు, స్థలంతోపాటు, అధిక వేతనాలు అందించేందుకు సైతం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 1000 దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయని, అందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఇతర ప్రాంతాలనుంచి కూడ అభ్యర్థులను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా మేయర్ బ్రియాన్ కేడోజిన్ తెలిపారు. క్లుతా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎక్కువగా డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పరిశ్రమల్లోనే కావడం, దానికి తోడు కైటంగట పట్టణం ఓ మారుమూలకు ఉండటం కూడ ఇక్కడకు ఉద్యోగాలకోసం వచ్చేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్నట్లు మేయర్ చెప్తున్నారు. ఖాళీలను భర్తీ చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు. స్థానిక ప్రజలు ఉద్యోగాలకు సరిపోకపోవడంతో సమీపంలోనే ఉన్న డునిడెన్ నుంచి బస్సుల్లో కొందర్ని ఇక్కడికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తాను, తన కుటుంబం తిండికోసం ఇబ్బందులు పడుతున్నపుడు ఈ ప్రాంతం తనకు ఉద్యోగాన్నిచ్చి ఆదుకుందని, ఇప్పుడు తానుసైతం ఇబ్బందులుపడే ఇతర కివి కుటుంబాలకు ఉద్యోగాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు బ్రియాన్ చెప్తున్నారు. అలాగే కైటంగటలో డైరీ ఫాం నిర్వహిస్తున్న మూడో తరం వ్యక్తి ఎవాన్ డిక్ కూడ ఈ డ్రైవ్ లో భాగం పంచుకున్నాడు. ఇదో ఓల్డ్ ఫ్యాషన్ కమ్యూనిటీ అని, ఇక్కడ ఇళ్ళకు ఎవ్వరూ తాళాలు కూడ వేసుకోరని, పిల్లలు హాయిగా పరుగులు పెట్టి ఆడుకునేట్లుగా ఉండే ఈ ప్రాంతంలో అధికశాతం ఉద్యోగాలు, ఇళ్ళు ఉన్నా... ప్రజలే తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగాలు కావాలన్నా దొరకని నేటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలిస్తాం రండి బాబూ.. అంటూ అభ్యర్థులకోసం పడిగాపులు పడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ... -
ఒక్క ఛాన్స్ కోసం.. ఎంత కష్టపడాలో
ముంబై: చిత్రపరిశ్రమతో సంబంధంలేని తనలాంటి వారికి సినిమాల్లో నటించేందుకు ఒక్క అవకాశం రావాలంటే ఎంతో కష్టపడాలని బాలీవుడ్ నటి కృతీ కుల్హారి చెబుతోంది. సినిమాల్లో నటించేందుకు అవకాశం వచ్చినా, ప్రతిభను నిరూపించుకుంటేనే మళ్లీ అవకాశాలు వస్తాయని, లేకుంటే సినిమాల్లో కొనసాగడం కష్టమని వెల్లడించింది. వారసుల పిల్లలకు అయితే సులభంగా అవకాశాలు వస్తాయని, తనలాంటి వారి పరిస్థితి పూర్తిగా భిన్నమని వెల్లడించింది. ’ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా ప్రతిభను చూడండి’ అన్నట్టుగా తాపత్రయపడతారని చెప్పింది. తనకు సినిమాల్లో నటించే అవకాశం రాకుంటే చాలామందిలా అనామకురాలిగా ఉండేదాన్నని కృతి పేర్కొంది. కిచ్డీ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన కృతికి ’పింక్’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలసి నటించే అవకాశం వచ్చింది. అమితాబ్‌తో కలసి నటించడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నానని, దాన్ని మాటల్లో చెప్పలేనని అంది.