
సాక్షి, ముంబయి : మహారాష్ట్రలో మరోసారి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు గుండాగిరికి దిగారు. మరాఠేతరులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ పార్టీ జెండాలు విరిగిపోయేలా వారిని చావు దెబ్బలు కొట్టారు. తమ ప్రాంతంలో ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారని జులుం ప్రదర్శిస్తూ చెలరేగిపోయారు. సంగ్లీ పరిధిలోని కుప్వాడ్ ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పలువురు మహారాష్ట్రేతరులు పనిచేస్తుంటారు. వారి సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది.
ఎన్నో పరిశ్రమలు, తయారీ యూనిట్లు, ఫ్యాక్టరీలు, మిల్లులు ఉన్న ఇక్కడ మహారాష్ట్రేతర్లు చాలామంది ఉంటారు. అయితే, వారు ఇక్కడ పనిచేయొద్దని స్థానికులు మాత్రమే ఉండాలని, ఉద్యోగాలు ఇచ్చే వారు కూడా స్థానికులకే ఇవ్వాలని నినాదాలు ఇస్తూ ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచారు. తమ ప్రాంతాల్లో నేరాలు జరగడానికి కారణం వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారేనని వారు ఆరోపించారు. స్థానికుల ఉద్యోగాలను స్థానికేతరులు దోచుకెళుతున్నారని మండిపడ్డారు
Comments
Please login to add a commentAdd a comment