‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్‌సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర.
ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు.
క్యాస్టింగ్ కౌ^Œ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment