star kids
-
Prince World 2024: మోడల్ కార్తికేయ
మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్‌తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్‌కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.థాయ్‌లాండ్‌లో ‘ప్రిన్స్’కిరీటం..కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్‌ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు. ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్‌తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.రెండేళ్లకు బ్రేక్కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్‌కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్‌ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్‌కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్‌లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్‌గా, మోడల్‌గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇద్దరూ ఆణిముత్యాలేతమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం -
ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్
బాలీవుడ్లో ఎంతోమంది స్టార్ కిడ్స్ను వెండితెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత ఎవరని అడిగితే ఠక్కున గుర్తుచ్చే పేరు కరణ్ జోహార్. ఇప్పటికే కరణ్ ఎంతోమంది స్టార్ వారసులను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశాడు. బీటౌన్ స్టార్స్ కూడా తమ వారసులను కరణ్ చేతిలో పెట్టాలని ఆశ పడుతుంటారు. ఇదిలా ఉండగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాపై కరణ్ ఈమధ్య ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే లైగర్ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను బాలీవుడ్‌కు పరిచయం చేసిన కరణ్ ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోను కూడా బీటౌన్‌కు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఆయన మరెవరో కాదు. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని . ఇప్పటికే దీనికి సంబంధించి నాగ్ కరణ్‌తో చర్చలు జరుపుతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. త్వరలోనే కరణ్ అఖిల్‌ని హిందీలో లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
బాలల దినోత్సవం : స్టార్ కిడ్స్‌పై ఓ లుక్కేద్దామా!
Children's Day 2021: సినీ సెలబ్రిటీల పిల్లలంటే ఫాన్స్‌కి ఎంత క్రేజో చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పిల్లలు కూడా అందం, అభినయం, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్సులతో అదరగొట్టాలని ఆశిస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలు ఎన్నో విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. ఎంతైనా వారుకూడా తల్లితండ్రులే కదా. అయితే కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చిన్నతనంలోనే సిసింద్రీల్లా దూసుకుపోతున్నారు. సొంత వ్యక్తిత్వంతో తమకంటూ ఒక ఐడెంటిని క్రియేట్ చేసుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమదైన శైలిలో రాణిస్తున్నారు. వివాదాల్లో ఇరుకు్కంటున్నవారు కూడా కూడా ఉన్నారు. నవంబరు 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్‌పై ఒక లుక్కేద్దాం. -
స్టార్ కిడ్స్ ముఖాలు రెండోసారి చూడగలమా : నటి
Nia Sharma Slams Star Kids: ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ తనపై చేస్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడిన ఆమె స్టార్ కిడ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'చాలామంది నేను అందంగా లేనని, నా పర్సనాలిటీ బాగోదని, అందుకే సినిమాల్లో అవకాశాలు రావట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మాట్లాడే వాళ్లు ఒక్కసారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ ముఖాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ల పేరేంట్స్ పేర్లు పక్కన లేకపోతే రెండోసారి వాళ్ల ముఖాలు ఎవరూ చూడలేరు. స్టార్ స్టేటస్ ఉంది కాబట్టి వాళ్లు సినిమాలు చూస్తున్నాం తప్పా వాళ్లకంత సీన్ లేదు. నిజం చెప్పాలంటే నేను స్టార్ కిడ్స్ కంటే వంద శాతం బెటర్' అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఇక మణికర్ణిక సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడగ్గా.. దాని గురించి మాట్లాడటం తెలివి తక్కువ పనే అవుతుందని, అంతేకాకుండా తన టైం కూడా వేస్ట్ అని పేర్కొంది. ఇక హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన నియా శర్మ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చదవండి : ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. గ్రాండ్‌గా సుకుమార్ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ -
ముగ్గురు వారసులు.. ఓ సినిమా
హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది స్టార్ల వారసత్వం హిందీ తెరపై కనిపించింది. కానీ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండటం బీ టౌన్లో చర్చనీయాంశమైంది. ‘జిందగీ నా మిలేగీ దొబార’, ‘గల్లీభాయ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలు జోయా అక్తర్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ఫిల్మ్ చేయనున్నారు. ఒక అంతర్జాతీయ బుక్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బీటౌన్ బాద్ షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటించనున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని బీటౌన్ టాక్. మరి.. ఈ వె»Œ æఫిల్మ్‌తో ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే. -
మూడు సినిమాల నుంచి తప్పించారు
‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర. ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు. క్యాస్టింగ్ కౌ^Œ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి. -
బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కేవలం స్టార్ హీరోల వారసులు మాత్రమే ఎదుగుతున్నారనే వాదన ఎక్కువగా వినబడుతోంది. గాడ్‌ఫాదర్ లేనిదే గ్రాండ్ సక్సెస్‌తో ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు ఫ్లాపులు పడితే సర్దుకొని ఇంటికెళ్లాల్సిందే. ప్రతిభ ఎంత ఉన్న సినీ పరిశ్రమ మళ్లీ వారివైపు కన్నెత్తైనా చూడదు. అదే స్టార్ కిడ్స్ అయితే ఆడిషన్స్ దగ్గర నుంచే అన్ని విషయాలలో రెడ్ కార్పెట్‌తో స్వాగతం చెబుతుంది. ఒక్క సినిమా కూడా చేయకముందే వారికి ఎంతో మంది అభిమానులు పుట్టుకొస్తారు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయిన నిర్మాతలు వారి ఇంటి తలుపు కొడుతూనే ఉంటారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఉండే పక్షపాత ధోరణిపై చాలా మంది గళం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో స్కూప్‌లు చేయడంలో ప్రముఖుడైన సలీల్ జమ్దార్ సినీ పరిశ్రమపై చేసిన జింగాత్ ధడక్ అనే పేరడీ సాంగ్ మళ్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. 2018లో ఈ పాట విడుదలైంది. కానీ ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య తరువాత మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆడిషన్స్ దగ్గర నుంచి సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని చూపించారు. ('సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') స్టార్ కిడ్స్‌కు కష్టపడకుండానే ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనే విషయాన్ని చూపించారు. బాలీవుడ్ స్టార్ పిల్లలపై ‘జింగాత్ ధడక్’ పేరడీ పాటను రూపొంచారు. ఈ పాటను చూస్తే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి పునరాలోచన చేయకుండా ఉండరు. ఈ పేరడీ పాట ట్యూన్‌ను ధడక్ సినిమా పాట నుంచి తీసుకున్నారు. ధడక్ సినిమా సైరత్ అనే మరాఠీ సినిమా రీమేక్. ఈ సినిమాలో ఎలాంటి స్టార్లు లేకపోయిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ధడక్ సినిమాలో మాత్రం స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ నటించారు. ఈ పేరడీపాటలో స్టార్ కిడ్స్ అలియాభట్, వరుణ్‌ధావన్, రణబీర్ కపూర్ వీరితోపాటు మరికొంత మంది స్టార్ పిల్లల్ని చూపించారు. ప్రతిభతో సంబంధం లేకుండా ఏ కష్టం పడకుండా స్టార్ హీరోల వారసులు సులువుగా గుర్తింపు పొందుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ బంధుప్రీతిపై తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. (ముసుగులు తొలగించండి) -
‘అభిషేక్ నటించడం మాని వడపావ్ అమ్ముకో’
బాలీవుడ్లో నెటిజన్ల చేతిలో తరచుగా ట్రోలింగ్‌కు గురయ్యే నటుడు ఎవరైనా ఉన్నారంటే అదిఅభిషేక్ బచ్చనే. గత కొంత కాలంగా అభిషేక్ కెరీర్లో సరైన హిట్లు లేవు. ఈ మధ్యే ఆయన నటించిన ‘మన్మర్జియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా అభిమానులను నిరాశ పర్చడంతో నెటిజన్లు అభిని విమర్శిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇలా కామెంట్ చేసిన వారిలో హర్షవర్ధన్ కాలే అనే వైద్యుడు కూడా ఉన్నాడు. హర్షవర్ధన్ అభిని అవమానిస్తూ ‘‘మన్మర్జియా’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎంత మంచి సినిమా అయినా సరే.. దానిలో అభిషేక్ బచ్చన్ నటిస్తే ఫ్లాప్ అవుతుంది. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. హిట్ సినిమాను.. ఫ్లాప్ చేసే టాలెంట్ అందరికీ ఉండదు. బంధుప్రీతికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అభిషేక్‌తో పాటు ఇతర స్టార్‌కిడ్స్ నటించడం మానేసి వడాపావ్ వ్యాపారం చేసుకోవాలి’ అంటూ ట్విటర్లో ఓ మెసేజ్ పెట్టాడు. అంతేకాక ‘స్త్రీ’ సినిమా మంచి విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది ప్రతిభ ముఖ్యమని’ అంటూ హర్షవర్ధన్ ట్వీట్ చేశాడు. #Manmarziyaan tanked at box-office, once again proving @juniorbachchan to be legend with amazing ability to make good film a flop! Kudos to his abilities, not many have it! It time to end #nepotism and for #StarKids to start #Vadapav stall..lol! #Stree proves #TalentCounts!! pic.twitter.com/mFdJTZ0ERA — drharshavardhankale (@DrHarshKale) September 25, 2018 అయితే సదరు వైద్యుడు చేసిన కామెంట్స్‌కి జూనియర్ బచ్చన్ తనదైన శైలీలో సమాధానం చెప్పాడు. ‘డాక్టర్ లాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు అన్ని విషయాల గురించి తెలుసుకుని మాట్లాడితే మంచింది. ముందు మీరు బాక్సాఫీస్ లెక్కలు, నిజానిజాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. మీ దగ్గరకు వచ్చే పేషంట్సతో కూడా ఇలానే ప్రవర్తిస్తారా’ అంటూ అభి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ల పరంపర ఇంతటితో ఆగలేదు. అభి ట్వీట్‌కు హర్షవర్ధన్ ప్రతిస్పందిస్తూ..‘మీరు ఇలాగే ఆశిస్తూ ఉండండి జూనియర్ బచ్చన్. ఇలా ట్వీట్ చేయడానికి నేనేం సిగ్గు పడటం లేదు. వరుసగా 16 ఫ్లాప్స్ ఇచ్చిన యాక్టర్లు సిగ్గుపడాలి. ఇండస్ట్రీలో బంధుప్రీతి రాజ్యమేలుతోంది కదా.. మీరు మంచి మనిషే కావచ్చు. కానీ భయంకరమైన యాక్టర్’ అంటూ రిట్వీట్ చేశాడు. With all due respect kind sir, I would expect an esteemed doctor such as yourself to study all the facts and figures before proclaiming anything. I certainly hope you do so with your patients. Learn the economics of the film before you tweet something that will embarrass you. 🙏 — Abhishek Bachchan (@juniorbachchan) September 26, 2018 అతని ట్వీట్స్‌కు అభిషేక్ స్పందిస్తూ.. ‘వడా పావ్ వ్యాపారం పెట్టుకోవడం చాలా గౌరవప్రదమైన అంశం. దానిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఇతర వృత్తులను కించపరచకండి. ఎవరికి వారు తమ రంగాల్లో బాగానే రాణిస్తున్నారు. మీరు అన్నట్లు ‘స్త్రీ’ చిత్రం మంచి విజయం అందుకుంది. కానీ ఆ సినిమాలోనూ ఓ స్టార్ కిడ్(శ్రద్ధా కపూర్) ఉన్నారని మరచిపోకండి. సినిమాలను.. మమ్మల్ని విశ్లేషించడం మానేసి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి’ అంటూ అభి ట్వీట్ చేశారు. And for your kind information ( and I'm sure all vada pav stall owners will agree) there is great dignity in owning and running a vada pav stall. It's called dignity of labour. Try not to be so patronising about another professional. We are all doing our best. — Abhishek Bachchan (@juniorbachchan) September 26, 2018 -
అదిరె.. అదిరె స్టైల్!
బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు మీడియాలోనూ వారికి ఫుల్ పాపులారిటీ ఉంది. వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ ఫాలో కావడంలో ముందుంటారు. కెమెరా కంట ఎప్పుడు కనపడినా.. తమ స్టైలిష్ లుక్‌తో అబ్బో అనిపిస్తున్నారు. అలా ఈ నలుగురు సుందరాంగులు తాజాగా కెమెరా కంటికి చిక్కారు. వారి స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. బ్లాక్ డ్రెస్‌లో.. కింగ్ ఖాన్ షారుఖ్ గారాలపట్టి సుహానా ఖాన్. ఇటీవల తల్లి గౌరీఖాన్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో తళుక్కుమంది ఈ సుందరాంగి. బ్లాక్ అసిమెట్రిక్ టాప్, హాట్ప్యాంట్స్ ధరించి.. నడుముకు గోల్డ్లేస్ విస్ట్బ్యాండ్తో ఫ్యాబులస్ లుక్‌తో సుహానా అదరగొట్టింది. ఆహా.. అనన్య..! నటుడు చుంకీ పాండ్యా తనయ అనన్య పాండ్యా గురించి తెలియనివారుండరు. సుహానా ఖాన్ బెస్టీ అయిన అనన్య ఇటీవల తన కజిన్ బర్త్‌డేలో అదిరె లుక్‌తో కనిపించింది. మెటాలిక్ షేడ్ స్లిప్ డ్రెస్‌తో అందరి లుక్స్‌ను తనవైపునకు తిప్పుకుంది. అబ్బో.. అలన్నా..! అనన్య పాండే చిట్టిచెల్లెలు అలన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. మోనిషా జైసింగ్ డిజైన్ చేసిన డ్రెస్‌లో ఈ అమ్మడు అదరగొట్టింది. స్టైలిష్ జాన్వీ..! జాన్వీ ఆ పేరు వింటేనే కుర్రకారు పడిచస్తారు.. ఆమె అందానికి ఫిదా అవుతారు. అతిలోక సుందరి శ్రీదేవి గారాల తనయ అయిన జాన్వీ ఇటీవల జిమ్ సెషన్‌ను ముగించుకొని.. అదిరే స్టైలిష్ డ్రెస్‌లో ఇలా దర్శనమిచ్చింది. -
సీక్వల్ సినిమాతో వారసుల ఎంట్రీ
సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్‌లోనూ స్టార్ వారసుల హవా బాగా కనిపిస్తోంది. ఇప్పటికే వారసులగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది తారలు స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతుండగా, ఇప్పుడు ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు తెరంగేట్రానికి రెడీ అవుతున్నారు. అది కూడా గతంలో స్టార్ వారసులను పరిచయం చేసిన సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం మరో విశేషం. ఒకప్పుడు ప్రేమ జంటగా బాలీవుడ్ యమా పాపులర్ అయిన షాహిద్ కపూర్, కరీనా కపూర్ల వారసులు ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్, మొదటి భార్య కూతురు, సారా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. తనతో పాటు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ ఇద్దరు స్టార్ వారసులతో 2012లో ఘన విజయం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అలియాభట్, వరుణ్ ధావన్, సిద్దార్ధ్ మల్హోత్రలకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే తమ కెరీర్‌కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఈ స్టార్ వారసులు.