స్టార్‌ కిడ్స్‌ ముఖాలు రెండోసారి చూడగలమా : నటి | Nia Sharma Slams Star Kids and Those Supporting Them | Sakshi
Sakshi News home page

Nia Sharma: 'స్టార్‌ కిడ్స్‌కు అంత సీన్‌ లేదు..వాళ్లకంటే నేను 100%బెటర్‌'

Published Fri, Sep 24 2021 8:01 PM | Last Updated on Fri, Sep 24 2021 8:20 PM

Nia Sharma Slams Star Kids and Those Supporting Them - Sakshi

Nia Sharma Slams Star Kids: ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ తనపై చేస్తున్న బాడీ షేమింగ్‌ కామెంట్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడిన ఆమె స్టార్‌ కిడ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'చాలామంది నేను అందంగా లేనని, నా పర్సనాలిటీ బాగోదని, అందుకే సినిమాల్లో అవకాశాలు రావట్లేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలా మాట్లాడే వాళ్లు ఒక్కసారి బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ ముఖాలు చూస్తే అర్థమవుతుంది.

వాళ్ల పేరేంట్స్‌ పేర్లు పక్కన లేకపోతే రెండోసారి వాళ్ల ముఖాలు ఎవరూ చూడలేరు. స్టార్‌ స్టేటస్‌ ఉంది కాబట్టి వాళ్లు సినిమాలు చూస్తున్నాం తప్పా వాళ్లకంత సీన్‌ లేదు. నిజం చెప్పాలంటే నేను స్టార్‌ కిడ్స్‌ కంటే వంద శాతం బెటర్‌' అంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేసింది.

ఇక మణికర్ణిక సినిమా ఎక్స్‌పీరియన్స్‌ గురించి అడగ్గా.. దాని గురించి మాట్లాడటం తెలివి తక్కువ పనే అవుతుందని, అంతేకాకుండా తన టైం కూడా వేస్ట్‌ అని పేర్కొంది. ఇక హిందీ సీరియల్స్‌తో పాపులర్‌ అయిన నియా శర్మ తాజాగా చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

చదవండి : ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..
గ్రాండ్‌గా సుకుమార్‌ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement