సీక్వల్ సినిమాతో వారసుల ఎంట్రీ | star kids will make their debut in student of the year 2 | Sakshi
Sakshi News home page

సీక్వల్ సినిమాతో వారసుల ఎంట్రీ

Published Tue, Mar 29 2016 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

సీక్వల్ సినిమాతో వారసుల ఎంట్రీ

సీక్వల్ సినిమాతో వారసుల ఎంట్రీ

సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్లోనూ స్టార్ వారసుల హవా బాగా కనిపిస్తోంది. ఇప్పటికే వారసులగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది తారలు స్టార్ ఇమేజ్తో దూసుకుపోతుండగా, ఇప్పుడు ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు తెరంగేట్రానికి రెడీ అవుతున్నారు. అది కూడా గతంలో స్టార్ వారసులను పరిచయం చేసిన సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం మరో విశేషం.

ఒకప్పుడు ప్రేమ జంటగా బాలీవుడ్ యమా పాపులర్ అయిన షాహిద్ కపూర్, కరీనా కపూర్ల వారసులు ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్, మొదటి భార్య కూతురు, సారా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. తనతో పాటు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

ఈ ఇద్దరు స్టార్ వారసులతో 2012లో ఘన విజయం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకు సీక్వల్ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అలియాభట్, వరుణ్ ధావన్, సిద్దార్ధ్ మల్హోత్రలకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే తమ కెరీర్కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఈ స్టార్ వారసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement