Shahid Kapoor Opens on His Leaked Video with Kareena Kapoor - Sakshi

Shahid Kapoor: ఆరేళ్ల డేటింగ్‌, నైట్‌ క్లబ్‌లో ప్రైవేట్‌ వీడియో లీక్‌ కావడంతో హీరో షాక్‌!

Jul 9 2023 2:06 PM | Updated on Jul 9 2023 3:45 PM

Shahid Kapoor Opens on His Leaked Video with Kareena Kapoor - Sakshi

అమ్మాయితో ఎలా ఉండాలో కూడా తెలియదు. పైగా అప్పుడు డేటింగ్‌లో ఉంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు పెళ్లైంది కాబట్టి అటువంటి విషయాలు ఎవరూ ప

షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌.. ఒకప్పుడు వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్‌లో క్యూట్‌ లవ్‌ బర్డ్స్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎన్నో ప్రేమకథల్లాగే వీరి కథ కూడా సుఖాంతం కాలేదు. 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైన వీరి లవ్‌ కహానీ 2006లో బ్రేకప్‌తో ముగిసింది. అయితే 2004 సంవత్సరంలో వీరి ప్రైవేట్‌ వీడియో లీకైంది. ఓ క్లబ్బులో షాహిద్‌, కరీనా ఈ లోకాన్నే మర్చిపోతూ ముద్దులాటలో మునిగిపోయారు. అయితే ఈ వీడియో నెట్టింట లీకై అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కానీ ఆ సమయంలో ఇద్దరూ దీనిపై స్పందించనేలేదు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఘటనపై స్పందించాడు షాహిద్‌.

'అప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఆ ఫోటోలు, వీడియో లీక్‌ అయ్యేసరికి.. ఏంటి? ఏం జరుగుతోంది? అని షాక్‌లో ఉన్నాను. అంతా అయిపోయినట్లే అనుకున్నాను. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు మనల్ని ఎంతగానో ఇబ్బందిపెడతాయి. ఆ వయసులో మరీనూ! ఆ కుర్ర ఏజ్‌లో మన ఫీలింగ్స్‌ మనకే సరిగా అర్థం కావు. ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. పైగా అప్పుడు డేటింగ్‌లో ఉంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు పెళ్లైంది కాబట్టి అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు' అని షాహిద్‌ చెప్పుకొచ్చాడు.

అతడిని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ముగ్గురు పిల్లలు మాజీ ప్రేయసితో మీ ముద్దు వీడియోతో ఆఫీసుకు వచ్చారు. రూ.500 ఇచ్చాకే ఈ వీడియో మా చేతికిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా కపూర్‌ 2012లో హీరో సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి తైమూర్‌ అలీ ఖాన్‌, జే అలీ ఖాన్‌ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాహిద్‌ కపూర్‌ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. 2015లో మీరా రాజ్‌పుత్‌తో వివాహం జరగ్గా వీరికి మిషా, జైన్‌ అని ఇద్దరు సంతానం.

చదవండి: పార్టీలో పూటుగా తాగారు, తెల్లారేసరికి ఆమిర్‌ చేతికి బ్రేస్‌లెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement