అదిరె.. అదిరె స్టైల్‌! | star kids style, Suhana Khan Vs Ananya Panday | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 24 2017 4:24 PM | Last Updated on Sun, Dec 24 2017 4:44 PM

star kids style, Suhana Khan Vs Ananya Panday - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సోషల్‌ మీడియాలోనూ, అటు మీడియాలోనూ వారికి ఫుల్‌ పాపులారిటీ ఉంది. వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్‌ ఫాలో కావడంలో ముందుంటారు. కెమెరా కంట ఎప్పుడు కనపడినా.. తమ స్టైలిష్‌ లుక్‌తో అబ్బో అనిపిస్తున్నారు. అలా ఈ నలుగురు సుందరాంగులు తాజాగా కెమెరా కంటికి చిక్కారు. వారి స్టైలిష్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మీరు ఓ లుక్‌ వేయండి.

బ్లాక్‌ డ్రెస్‌లో..
కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ గారాలపట్టి సుహానా ఖాన్‌. ఇటీవల తల్లి గౌరీఖాన్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో తళుక్కుమంది ఈ సుందరాంగి.  బ్లాక్‌ అసిమెట్రిక్‌ టాప్‌, హాట్‌ప్యాంట్స్‌ ధరించి.. నడుముకు గోల్డ్‌లేస్‌ విస్ట్‌బ్యాండ్‌తో ఫ్యాబులస్‌ లుక్‌తో సుహానా అదరగొట్టింది.

ఆహా.. అనన్య..!
నటుడు చుంకీ పాండ్యా తనయ అనన్య పాండ్యా గురించి తెలియనివారుండరు. సుహానా ఖాన్‌ బెస్టీ అయిన అనన్య ఇటీవల తన కజిన్‌ బర్త్‌డేలో అదిరె లుక్‌తో కనిపించింది. మెటాలిక్‌ షేడ్‌ స్లిప్‌ డ్రెస్‌తో అందరి లుక్స్‌ను తనవైపునకు తిప్పుకుంది.

అబ్బో.. అలన్నా..!
అనన్య పాండే చిట్టిచెల్లెలు అలన్నా కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవుతోంది. మోనిషా జైసింగ్‌ డిజైన్‌ చేసిన డ్రెస్‌లో ఈ అమ్మడు అదరగొట్టింది.

స్టైలిష్‌ జాన్వీ..!
జాన్వీ ఆ పేరు వింటేనే కుర్రకారు పడిచస్తారు.. ఆమె అందానికి ఫిదా అవుతారు. అతిలోక సుందరి శ్రీదేవి గారాల తనయ అయిన జాన్వీ ఇటీవల జిమ్‌ సెషన్‌ను ముగించుకొని.. అదిరే స్టైలిష్‌ డ్రెస్‌లో ఇలా దర్శనమిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement