షారుఖ్ ఖాన్ గారాలాపట్టి సుహాన్ ఖాన్ బాలీవుడ్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? ఆమెను ఎప్పుడు వెండితెర మీద చూద్దామా? అని సుహానా ఫ్యాన్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఆమె బాలీవుడ్‌లోకి ఎంటరవ్వడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల లండన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సుహానా ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం స్కూల్‌లో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు.
మరోవైపు సుహానా బాల్య స్నేహితురాలు అనన్య పాండే ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేశారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా ‘జూమ్’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన బెస్టీ సుహానా ఖాన్ ఎప్పుడు సినిమాలోకి రాబోతుందో తెలిపారు. చదువులో భాగంగా న్యూయార్క్‌లో ఫిలిం స్కూల్‌కు వెళ్లబోతున్న సుహనా తన చదువు పూర్తికాగానే సినిమాల్లోకి వచ్చే అవకాశముందని, చదువు పూర్తయిన తర్వాత తనకు ఎప్పుడు ఇష్టమైతే.. అప్పుడు సుహానా సినిమాల్లోకి వస్తారని తెలిపారు. సుహానా ఎంతో టాలెంటెడ్ అని అంతకుముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పొగడ్తల వర్షం కురిపించారు.
‘స్కూల్‌లో నేను, సుహానా ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. తను చాలా మంచి నటి. తన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. తను చాలా మంచిది. నేను తనకేమీ టిప్స్ ఇవ్వను. నిజానికి తన నుంచి నేను టిప్స్ తీసుకుంటాను’ అని అనన్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment