టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.. ఇరు కుటుంబాలు, వారి స్నేహితుల మధ్య పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అక్కడి నుంచి వారు హైదరాబాద్ తిరిగి వచ్చాక తాజాగా నవంబర్ 5న టాలీవుడ్ స్నేహితులతో వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిలు నూతన వధూవరులుగా చేయి చేయి కలిపి సంతోషంగా సందడి చేశారు.
ఈ జంట సొగసైన దుస్తులను ధరించి కలర్‌ఫుల్‌గా కనిపించారు. లావణ్య మెటాలిక్ చీర దరించిగా.. వరుణ్ తేజ్ బ్లేజర్‌తో మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. లావణ్య, వరుణ్ తమ వివాహ వేడుక కోసం బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంచుకున్నారు. ఆయన బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన రేఖ, శ్రీదేవి, రవీనా టాండన్ ,కాజోల్ , సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, అనుష్కా వంటి స్టార్స్‌కు ఎన్నో రకాల దుస్తులను డిజైన్ చేసి పేరు గడించాడు.
దక్షిణ- భారత శైలికి అనుగుణంగా.. హిందూ వివాహం సాంప్రదాయ ప్రకారం లావణ్య-వరుణ్ వివాహ వేడకల నుంచి రిసెప్షన్ వరకు దుస్తుల విషయంలో మనీష్ మల్హోత్రానే చూసుకున్నాడు. అయితే రిసెప్షన్ కోసం లావణ్య త్రిపాఠి ధరించిన చీరను మనీష్ మల్హోత్రా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ. 2.75 లక్షలు. గతంలో ఇదే మోడల్ చీరలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మెరిసింది.
(ఇదీ చదవండి: రిసెప్షన్‌లో ఆ ఇద్దరి పాదాలకు నమస్కరించిన లావణ్య త్రిపాఠి)
బాలీవుడ్‌లోని ఒక ప్రముఖ ఈవెంట్‌లో సుహానా ఆ చీరలో అదరహో అనేలా కనిపించింది. దీంతో లావణ్య కూడా అదే మోడల్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. బంగారు వర్ణంలో ఉన్న ఆ చీరలో లావణ్య మరింత కలర్‌ఫుల్‌గా సుహానాకు ఏ మాత్రం తగ్గకుండా మెరిసిపోయిందని చెప్పవచ్చు. లావణ్య పెళ్లి సమయంలో ఎరుపు వర్ణంలో చీరను ధరించింది.. దాని ధర సుమారు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది. ఆ చీరకు ఎక్కువగా బంగారంతో ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment