Shah Rukh Khan Daughter Suhana Khan Dating With Big B Grandson Agastya Nanda, Deets Inside - Sakshi
Sakshi News home page

Suhana Khan: బిగ్‌బీ మనవడితో షారుక్‌ కూతురి ప్రేమాయణం

Published Thu, Jan 5 2023 7:21 PM | Last Updated on Thu, Jan 5 2023 7:42 PM

Shah Rukh Khan Daughter Suhana Khan Dating With Big B Grandson - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోపక్క అతడి కొడుకు హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో షారుక్‌ కూతురు సుహానా ఖాన్‌ కూడా లవ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందాతో సుహానా ప్రేమలో మునిగి తేలుతోందట. ఇటీవల జరిగిన క్రిస్‌మస్‌ వేడుకలో కుటుంబసభ్యులందరి ముందుకు సుహానాను తన ప్రేయసిగా పరిచయం చేశాడట అగస్త్య.

కాగా వీరిద్దరూ ద ఆర్చీస్‌ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జోయా అఖ్తర్‌ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్‌ బర్డ్స్‌ తమ ప్రేమ విషయాన్ని ఇప్పుడప్పుడే బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదట. ఇకపోతే కొడుకు ప్రేమకు అప్పుడే పచ్చజెండా ఊపేసిందట శ్వేతా బచ్చన్‌. మరి వీరి లవ్‌ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి!

చదవండి: దొంగతనం చేస్తూ దొరికిపోయిన బిగ్‌బాస్‌ విన్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement