Agastya Nanda
-
అమితాబ్ మనవడికి ఎగ్జిమా! ఇది ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ప్రేకక్షుల ప్రశంసలందుకుంటున్నారు అమితాబ్. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతికి అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మనవడు అగస్త్య నంద 'ది ఆర్చీస్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్యూలో తాను ఎగ్జిమా అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఎగ్జిమా? ఎందువల్ల వస్తుంది. అగస్త్య సోదరి నవ్య నేవలి నంద హోస్ట్ చేసిన 'వాట్ ది హెల్ నవ్య పాడ్‌క్యాస్ట్' ప్రోగ్రాంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయబచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ముగింపులో చర్మ సంరక్షణ విషయంలో ఎవరిని సంప్రదిస్తారని ప్రశ్నించగా అగస్త్య తాను తల్లినే ఆశ్రయిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎగ్జిమా(తామర)తో బాధపడుతున్నట్లు అగస్త్య తెలిపారు. ఇది తనను బాగా వేధించే సమస్య అని అన్నారు. తన సహ నటులతో కలిసి నటించే సమయంలో ఈ సమస్య కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తాను ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌క్రీమ్, షేస్ వాష్ వంటి వాటిని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటానని అన్నారు. అయితే తామరకు ఇంతవరకు బెస్ట్ అయింట్మెంట్ అంటూ ఏదీ లేకపోవడం బాధకరం అని చెప్పారు. దయచేసి దానికి సరైన మందు కనుక్కొండని వేడుకున్నాడు అగస్త్య. ఇంతకీ ఏంటీ ఎగ్జామా అంటే.. ఎగ్జిమా అంటే.. తామర అనేది పిల్లలను పెద్దలను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ పరిస్థితి. దీనిని అటోపిక్ ఎగ్జిమా లేదా తామర అని కూడా అంటారు. దీని వల్ల చర్మంలో అస్సలు తేమగా ఉండదు. అస్తమాను పొడిగా ఉండి చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా చర్మం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయ్యి ఒక విధమైన గీతలు, చారలు రావడం జరుగుతుంది. అది కాస్త దురదగా, ఇరిటేట్‌గా ఉంటుంది. పోని గోకితే వెంటనే మరింత దురదగా ఉండి ఎర్రగా బొబ్బల్లా రావడం జరగుతుంది. లక్షణాలు.. చర్మం పొడిగా ఉండి, ఎరుపుగా ఉంటుంది. ఎక్కువుగా మోచేతుల మడతలు, మోకాళ్ల వెనుక, మణికట్టు, చీలమండలలో వస్తుంది. ఎక్కువుగా పెద్దలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఎక్కువుగా మెడ, ముఖంపై వస్తుంది. ఓ నాణెం సైజులో చేతులు, కాళ్లు, లేదా వీపుపై ఎర్రగా వస్తుంటాయి. అయితే ఎందువల్ల ఇలా వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబపరంగా వచ్చే వ్యాధే ఇది కూడా. అయితే వ్యక్తుల పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ తామర వస్తుందని వైద్యలు చెబుతున్నారు. తామర రావడానికి గల కారణాలు.. వ్యాధి నిరోధక శక్తి.. కొందరిలో వ్యాధి నిరోధక శక్తి వాతావరణంలో ఉండే బ్యాక్లీరియా లేదా వైరస్‌లకు అతిగా ప్రతిస్పందించడంతో అలెర్జీలకు దారితీయడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. అందువల్ల ముందుగా మన వ్యాధినిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకునేలా ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. జీన్స్.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. కుటుంబంలో ఎవ్వరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారి తర్వాత తరాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ కారకాలు.. కొందరూ పొడి వాతావరణంలో జీవిచడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వాతావరణంలో తేమ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైనా.. మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జిటీ, డిప్రెషన్ వంటి వాటికి గురైనా ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా సరిగా లేకపోయినా శరీరంపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు. వైద్యులు వద్దకు సకాలంలో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యను ఆదిలోనే నియంత్రించొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే పరిస్థితి మరింత జటిలం కాకమునుపే ఈ ఎగ్జిమాకు చికిత్స తీసుకోవడమే అని విధాల మంచిదని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: 'శబ్దమే శాపం ఆమెకు' అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..) -
షారుక్ కొడుకే కాదు కూతురు కూడా లవ్‌లో పడింది! ప్రియుడెవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోపక్క అతడి కొడుకు హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా లవ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో సుహానా ప్రేమలో మునిగి తేలుతోందట. ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకలో కుటుంబసభ్యులందరి ముందుకు సుహానాను తన ప్రేయసిగా పరిచయం చేశాడట అగస్త్య. కాగా వీరిద్దరూ ద ఆర్చీస్ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జోయా అఖ్తర్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్ బర్డ్స్ తమ ప్రేమ విషయాన్ని ఇప్పుడప్పుడే బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదట. ఇకపోతే కొడుకు ప్రేమకు అప్పుడే పచ్చజెండా ఊపేసిందట శ్వేతా బచ్చన్. మరి వీరి లవ్ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి! చదవండి: దొంగతనం చేస్తూ దొరికిపోయిన బిగ్‌బాస్ విన్నర్ -
హీరోగా పరిచయం అవుతున్న బిగ్ బి మనవడు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో అగస్త్య హీరోగా ది ఆర్చీస్ అనే చిత్రం తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అమెరికన్ కామిక్ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. రీమా కాగ్టీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా అగస్త్య ఎంట్రీపై బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అగస్త్య ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా అమితాబ్ మనువడికి ఆల్‌ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. “నీ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఇంతకంటే ఆనందం మాకు వేరేముంది? నా ఆశీస్సులు, ప్రేమ సదా తోడై ఉంటాయి” అంటూ బిగ్ బి ట్వీట్ చేశారు. కాగా ఇదే సినిమాతో షారుక్ ఖాన్ కూతురు సుహానా, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వెండితెరకు పరిచయం కానున్నారు. ఒకే ప్రాజెక్టుతో ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
బిగ్ బీ మనవడి బర్త్ డే.. అభిషేక్ బచ్చన్ ఎలా విష్ చేసాడో తెలుసా
Abhishek Bachchan Wishes To Agastya Nanda On His Birthday: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా మంగళవారం (నవంబర్ 23)న 21వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగస్త్యకు అతని సోదరి నవ్య నవేలి, మేనమామ అభిషేక్ బచ్చన్ బర్త్ డే విషెస్ తెలిపారు. పూజలో కూర్చున్న అగస్త్య చిన్ననాటి ఫొటోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు అభిషేక్ బచ్చన్. అందులో '21వ హ్యాపీ బర్త్ డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్, బాధ్యాయుతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అధికారికంగా పెద్దవాడివి. దయచేసి ఇకనైనా ఈ మామ బట్టలు, షూ వేసుకోకు. నీవే సొంతగా కొనుక్కో. లవ్ యూ'. అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ ' 21 ఏళ్లుగా నువ్ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు'. రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్ కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖుషీ కపూర్, సుహానా ఖాన్‌లతో జోయా అక్తర్ తర్వాతి చిత్రంలో అగస్త్య సినిమాల్లోకి అడుగుపెడతాడని గతంలో పుకార్లు వచ్చాయి. సెప్టెంబర్‌లో జోయా కార్యాలయం బయట ఈ ముగ్గురు కనిపించడం గమనార్హం. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by S (@shwetabachchan)