బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ప్రేకక్షుల ప్రశంసలందుకుంటున్నారు అమితాబ్. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్‌పతికి అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మనవడు అగస్త్య నంద 'ది ఆర్చీస్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్యూలో తాను ఎగ్జిమా అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఎగ్జిమా? ఎందువల్ల వస్తుంది.
అగస్త్య సోదరి నవ్య నేవలి నంద హోస్ట్ చేసిన 'వాట్ ది హెల్ నవ్య పాడ్‌క్యాస్ట్' ప్రోగ్రాంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయబచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ముగింపులో చర్మ సంరక్షణ విషయంలో ఎవరిని సంప్రదిస్తారని ప్రశ్నించగా అగస్త్య తాను తల్లినే ఆశ్రయిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎగ్జిమా(తామర)తో బాధపడుతున్నట్లు అగస్త్య తెలిపారు.
ఇది తనను బాగా వేధించే సమస్య అని అన్నారు. తన సహ నటులతో కలిసి నటించే సమయంలో ఈ సమస్య కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తాను ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌క్రీమ్, షేస్ వాష్ వంటి వాటిని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటానని అన్నారు. అయితే తామరకు ఇంతవరకు బెస్ట్ అయింట్‌మెంట్ అంటూ ఏదీ లేకపోవడం బాధకరం అని చెప్పారు. దయచేసి దానికి సరైన మందు కనుక్కొండని వేడుకున్నాడు అగస్త్య. ఇంతకీ ఏంటీ ఎగ్జామా అంటే..
ఎగ్జిమా అంటే..
తామర అనేది పిల్లలను పెద్దలను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ పరిస్థితి. దీనిని అటోపిక్ ఎగ్జిమా లేదా తామర అని కూడా అంటారు. దీని వల్ల చర్మంలో అస్సలు తేమగా ఉండదు. అస్తమాను పొడిగా ఉండి చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా చర్మం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయ్యి ఒక విధమైన గీతలు, చారలు రావడం జరుగుతుంది. అది కాస్త దురదగా, ఇరిటేట్‌గా ఉంటుంది. పోని గోకితే వెంటనే మరింత దురదగా ఉండి ఎర్రగా బొబ్బల్లా రావడం జరగుతుంది.
లక్షణాలు..
- చర్మం పొడిగా ఉండి, ఎరుపుగా ఉంటుంది.
- ఎక్కువుగా మోచేతుల మడతలు, మోకాళ్ల వెనుక, మణికట్టు, చీలమండలలో వస్తుంది.
- ఎక్కువుగా పెద్దలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది.
- పిల్లలకు ఎక్కువుగా మెడ, ముఖంపై వస్తుంది.
- ఓ నాణెం సైజులో చేతులు, కాళ్లు, లేదా వీపుపై ఎర్రగా వస్తుంటాయి. అయితే ఎందువల్ల ఇలా వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబపరంగా వచ్చే వ్యాధే ఇది కూడా. అయితే వ్యక్తుల పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ తామర వస్తుందని వైద్యలు చెబుతున్నారు.
తామర రావడానికి గల కారణాలు..
వ్యాధి నిరోధక శక్తి..
కొందరిలో వ్యాధి నిరోధక శక్తి వాతావరణంలో ఉండే బ్యాక్లీరియా లేదా వైరస్‌లకు అతిగా ప్రతిస్పందించడంతో అలెర్జీలకు దారితీయడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. అందువల్ల ముందుగా మన వ్యాధినిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకునేలా ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.
జీన్స్..
వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. కుటుంబంలో ఎవ్వరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారి తర్వాత తరాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణ కారకాలు..
కొందరూ పొడి వాతావరణంలో జీవిచడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వాతావరణంలో తేమ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఒత్తిడికి గురైనా..
మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జిటీ, డిప్రెషన్ వంటి వాటికి గురైనా ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా సరిగా లేకపోయినా శరీరంపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు.
వైద్యులు వద్దకు సకాలంలో వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటే సమస్యను ఆదిలోనే నియంత్రించొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే పరిస్థితి మరింత జటిలం కాకమునుపే ఈ ఎగ్జిమాకు చికిత్స తీసుకోవడమే అని విధాల మంచిదని చెబుతున్నారు వైద్యులు.
(చదవండి: 'శబ్దమే శాపం ఆమెకు' అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..)
Comments
Please login to add a commentAdd a comment