
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో అగస్త్య హీరోగా ది ఆర్చీస్ అనే చిత్రం తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అమెరికన్ కామిక్ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. రీమా కాగ్టీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా అగస్త్య ఎంట్రీపై బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అగస్త్య ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా అమితాబ్ మనువడికి ఆల్‌ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. “నీ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఇంతకంటే ఆనందం మాకు వేరేముంది? నా ఆశీస్సులు, ప్రేమ సదా తోడై ఉంటాయి” అంటూ బిగ్ బి ట్వీట్ చేశారు. కాగా ఇదే సినిమాతో షారుక్ ఖాన్ కూతురు సుహానా, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వెండితెరకు పరిచయం కానున్నారు. ఒకే ప్రాజెక్టుతో ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment