Eczema disease
-
అమితాబ్ మనవడికి ఎగ్జిమా! ఇది ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ప్రేకక్షుల ప్రశంసలందుకుంటున్నారు అమితాబ్. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతికి అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మనవడు అగస్త్య నంద 'ది ఆర్చీస్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్యూలో తాను ఎగ్జిమా అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఎగ్జిమా? ఎందువల్ల వస్తుంది. అగస్త్య సోదరి నవ్య నేవలి నంద హోస్ట్ చేసిన 'వాట్ ది హెల్ నవ్య పాడ్‌క్యాస్ట్' ప్రోగ్రాంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయబచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ముగింపులో చర్మ సంరక్షణ విషయంలో ఎవరిని సంప్రదిస్తారని ప్రశ్నించగా అగస్త్య తాను తల్లినే ఆశ్రయిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎగ్జిమా(తామర)తో బాధపడుతున్నట్లు అగస్త్య తెలిపారు. ఇది తనను బాగా వేధించే సమస్య అని అన్నారు. తన సహ నటులతో కలిసి నటించే సమయంలో ఈ సమస్య కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తాను ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌క్రీమ్, షేస్ వాష్ వంటి వాటిని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటానని అన్నారు. అయితే తామరకు ఇంతవరకు బెస్ట్ అయింట్మెంట్ అంటూ ఏదీ లేకపోవడం బాధకరం అని చెప్పారు. దయచేసి దానికి సరైన మందు కనుక్కొండని వేడుకున్నాడు అగస్త్య. ఇంతకీ ఏంటీ ఎగ్జామా అంటే.. ఎగ్జిమా అంటే.. తామర అనేది పిల్లలను పెద్దలను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ పరిస్థితి. దీనిని అటోపిక్ ఎగ్జిమా లేదా తామర అని కూడా అంటారు. దీని వల్ల చర్మంలో అస్సలు తేమగా ఉండదు. అస్తమాను పొడిగా ఉండి చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా చర్మం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయ్యి ఒక విధమైన గీతలు, చారలు రావడం జరుగుతుంది. అది కాస్త దురదగా, ఇరిటేట్‌గా ఉంటుంది. పోని గోకితే వెంటనే మరింత దురదగా ఉండి ఎర్రగా బొబ్బల్లా రావడం జరగుతుంది. లక్షణాలు.. చర్మం పొడిగా ఉండి, ఎరుపుగా ఉంటుంది. ఎక్కువుగా మోచేతుల మడతలు, మోకాళ్ల వెనుక, మణికట్టు, చీలమండలలో వస్తుంది. ఎక్కువుగా పెద్దలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఎక్కువుగా మెడ, ముఖంపై వస్తుంది. ఓ నాణెం సైజులో చేతులు, కాళ్లు, లేదా వీపుపై ఎర్రగా వస్తుంటాయి. అయితే ఎందువల్ల ఇలా వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబపరంగా వచ్చే వ్యాధే ఇది కూడా. అయితే వ్యక్తుల పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ తామర వస్తుందని వైద్యలు చెబుతున్నారు. తామర రావడానికి గల కారణాలు.. వ్యాధి నిరోధక శక్తి.. కొందరిలో వ్యాధి నిరోధక శక్తి వాతావరణంలో ఉండే బ్యాక్లీరియా లేదా వైరస్‌లకు అతిగా ప్రతిస్పందించడంతో అలెర్జీలకు దారితీయడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. అందువల్ల ముందుగా మన వ్యాధినిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకునేలా ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. జీన్స్.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. కుటుంబంలో ఎవ్వరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారి తర్వాత తరాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ కారకాలు.. కొందరూ పొడి వాతావరణంలో జీవిచడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వాతావరణంలో తేమ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైనా.. మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జిటీ, డిప్రెషన్ వంటి వాటికి గురైనా ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా సరిగా లేకపోయినా శరీరంపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు. వైద్యులు వద్దకు సకాలంలో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యను ఆదిలోనే నియంత్రించొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే పరిస్థితి మరింత జటిలం కాకమునుపే ఈ ఎగ్జిమాకు చికిత్స తీసుకోవడమే అని విధాల మంచిదని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: 'శబ్దమే శాపం ఆమెకు' అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..) -
ఇలా బతకటం కంటే...
చలాకీగా ఉంటూ అందరితో సరదాగా గడిపే యువతి. అయితే అరుదైన వ్యాధి ఆమెను మానసికంగా కుంగదీసింది. లాభం లేదనుకున్న యువతి.. తల్లిదండ్రులను చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఫాదర్స్ డే రోజున హంగ్ కాంగ్లో జరిగిన విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే... హంగ్ కాంగ్ సిటీ: ట్యూన్ మూన్‌కు చెందిన పాంగ్ చింగ్-యూ(23) నర్సింగ్ విద్యార్థిని. చదువులతోపాటు ఆటల్లో చురుకుగా ఉండే యువతి. అయితే కొన్నాళ్లుగా ఆమె ఎక్జిమా(చర్మ వ్యాధితో)తో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన ఆమె దారుణానికి పాల్పడింది. ఈ నెల 17వ తేదీన తల్లిదండ్రులను కత్తితో పొడిచి, ఆపై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పాంగ్ బెడ్ రూమ్‌లో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ‘ఎక్జిమా వ్యాధిగ్రస్తులకు పిల్లలుగా పుట్టడం కంటే.. పేదరికంలో పుట్టడం చాలా నయం. ఎందుకంటే పేదరికంలో పుడితే.. బతుకులను మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఎక్జిమాతో పుడితే చచ్చేదాకా అంతే. సూర్య కాంతిని, అంతెందుకు... అద్దంలో నా ముఖం నేను చూసుకోలేని పరిస్థితి. ఇలాంటి బతుకు కంటే చావటం మంచిదని నిర్ణయించుకున్నా. నా ఈ పరిస్థితికి నా పెరెంట్సే కారణం. అందుకు వాళ్లను కూడా తీసుకుపోతున్నా’ అని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. ఎక్జిమా అన్నది సాధారణంగా చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని పెద్దయ్యాక కూడా దాని లక్షణాలు బయటపడ్డవారు చాలా మందే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఎక్జిమా చికిత్స కోసం వాడే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా డిప్రెషన్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్జిమాతో బాధపడుతున్న వారిలో 30 శాతం డిప్రెషన్‌తో కూడా బాధపడుతుండటమే ఇందుకు తార్కాణమని వైద్యులు తెలిపారు.(ఎక్జిమాకి వైద్యం ఏదీ లేదు. కనుక, బాధను తగ్గించడం మరియు దురద నుండి ఉపశమనం లాంటి చికిత్సలు మాత్రమే ఉన్నాయి) -
ఎగ్జిమా
ఆయుర్వేద శాస్త్రానుసారం ఎగ్జిమా వ్యాధిని విచర్చికా వ్యాధిగా పిలుస్తారు. ఇది ఒక చర్మవ్యాధి. ఈ వ్యాధి మన శరీరంలో రోగ నిరోధక శక్తి హెచుతగ్గుల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. పెద్దవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అకాల ఆహార విహారాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అజిన్ల వలన జీర్ణశక్తి తగ్గి పిత్తదోషం ప్రకోపించిదీనివలన ఆమము అనే విషపదార్థాలు శరీర కణాల్లో ఏర్పడి చర్మ భాగాన్ని దూషింప జేస్తాయి. ఈ కారణాల వలన విచర్చికా వ్యాధి ప్రారంభమవుతుంది. ఇది 3 రకాలుగా వర్ణిస్తారు. 1. వాత దోష విచర్చికా: చర్మం పొడి బారినట్లు ఉండి, నొప్పి, దురద ఉంటుంది. 2. కఫ దోష విచర్చికా: చర్మం దళసరిగా ఉండి దురద, తేమ కలిగి ఉంటుంది. 3. పిత్త రోష విచర్చికా: మంట, జ్వరం మొదలైన లక్షణాలతో చర్మం చిట్లినట్లు ఉంటుంది. వ్యాధి కారణాలు.. శీతల పదార్థాలు, ఉప్పు, కారం, మసాలాలు, అధిక మోతాదులో కలిగిన పదార్థాలు తీసుకోవటం వలన, నిల్వ ఆహారం తీసుకోవటం, నూనెతో చేసిన పదార్థాలు వాడటం వలన, నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయటం, ఆల్కహాల్, టీ, కాఫీలు అధికంగా సేవించటం, మలబద్ధకం, అజీర్తి, ఒత్తిడి ఈ వ్యాధికి ముఖ్య కారణాలు. లక్షణాలు: దురద, చర్మం ఎర్రగా ఉండటం, ఎండిన చర్మం, చర్మంపై పొలుసులుగా ఏర్పడటం, వాపు, దురద, చర్మం మందబారటం, పొక్కులుగా ఏర్పడటం మొదలైన లక్షణాలు. తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. నూనె వస్తువులు, మసాలా, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. 2. ఔషధ గుణాలు కల సబ్బులు వాడాలి. 3. రోగి దుస్తులు వేరొకరు వేసుకోరాదు. 4. వేళకు భోజనం చేయాలి. రాత్రి పూట ఎక్కువగా మేల్కొనరాదు. 5. ఒత్తిడి, ఆలోచనలు మానుకోవాలి. 6. చల్లిని గాలిలో, అతి ఎండలో తిరగరాదు. ఆయుర్వేద వైద్యంలో చక్కని ఔషధాలు విచర్చికా వ్యాధికి అందుబాటులో ఉన్నాయి. అనుభవం కలిగిన వైద్యుల సమక్షంలో వ్యాధి నిర్థారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే శాశ్వతంగా ఎగ్జిమా వ్యాధిని నివారించుకోవచ్చు.