![Suhana Khan Spotted With Mystery Friend in Car, Hide Face From Media - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/23/suhana1.gif.webp?itok=ujjNcAx1)
Suhana Khan Spotted With Mystery Friend in Car: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్టార్ డైరెక్టర్ జోయా అక్తర్ దర్శకత్వంలో డెబ్యూ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే స్టార్ కిడ్ గుర్తింపు ఉన్న సుహానా బీ-టౌన్ వెండితెర ఎంట్రీకి ముందే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
చదవండి: భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా..
తరచూ ఫొటోషూట్స్‌తో పాటు తన అప్‌డేట్స్ ఇస్తూ సామాజికి మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక బాద్‌షా తనయగా ఎంతో పాపులారిటీ ఉన్న సుహానా తాజాగా మీడియా నుంచి ముఖం చాటేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మన్నత్ సమీపంలో ఆమె కారులో ఓ వ్యక్తితో కనిపించింది. వారిని చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పడంతో వారిద్దరూ ముఖాన్ని చేతులతో కప్పెసుకోవడం ఆశ్చర్యకరం. దీంతో వారు ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందందని, అంతేకాదు ఇంతకి సుహానా పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? అతడితో సుహానా రిలేషన్ ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
చదవండి: ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్
ఈ నేపథ్యంలో సుహానా సీక్రెట్ రిలేషన్‌లో ఉందని, అతను తన సీక్రెట్ ఫ్రెండ్(బాయ్‌ఫ్రెండ్ అయ్యింటాడు) అని, ఇప్పుడు మీడియాకు అడ్డం బుక్కవడంతో ఇద్దరు ముఖాలు చాటేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుహానా నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. 2019లో న్యూయార్క్ యునివర్శిటీలో ఆమె యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజీ డిగ్రీ పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment