Agasthya
-
అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. మరో నెల రోజుల పాటు అతడికి విశ్రాంతి లభించనుంది. దీంతో విరామ సమయాన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ మనోల్లాసం పొందుతున్నాడు హార్దిక్. ఇక ఇప్పుడు కుమారుడు అగస్త్య కూడా తన దగ్గరికి వచ్చేయడంతో మరింత ఖుషీ ఖుషీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.తల్లితో సెర్బియా వెళ్లిన అగస్త్యకాగా హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సామరస్యపూర్వకంగానే తాము విడిపోతున్నామని.. అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కుమారుడిని తీసుకుని నటాషా పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే, తాజాగా అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. సెర్బియా నుంచి ఈ చిన్నారి ముంబైకి చేరుకున్నాడు. హార్దిక్ వదిన, క్రికెటర్ కృనాల్ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది.కెరీర్ పరంగానూ ఒడిదొడుకులుకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా... జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం అతడే సారథి అవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యం అతడిని వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది బీసీసీఐ. శ్రీలంక పర్యటన -2024 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో పాటు.. శుబ్‌మన్ గిల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది. ఫిట్నెస్ కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రోహిత్ సేన సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడనుండగా.. అక్టోబరు 6 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. -
ప్రేమంటే నమ్మకం: హార్దిక్ మాజీ భార్య నటాషా పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత విరామం తీసుకున్న ఈ ఆల్‌రౌండర్ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తనకు తాను సమయం కేటాయించుకుని ప్రకృతి అందాల్లో సేద తీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.సింగర్‌తో ప్రేమలో?ఈ క్రమంలో పాండ్యా ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోల్లోని లొకేషన్.. బ్రిటిష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా దిగిన ఫొటోల లొకేషన్ ఒకేలా ఉండటంతో వీరిద్దరు కలిసే అక్కడకు వెళ్లారనే వదంతులు వ్యాపించాయి. దీంతో హార్దిక్ మరోసారి ప్రేమలో పడ్డాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ప్రేమను నిర్వచిస్తూ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు‘‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. ప్రేమలో ద్వేషం, అసూయ ఉండవు. గొప్పలు చెప్పుకోవడాలూ ఉండవు. ఇతరులను కించపరచడం, స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పొప్పులను లెక్కకడుతూ కోపం ప్రదర్శించదు. ప్రేమంటే నిజం.. నమ్మకం.. ఆశ.. రక్షణ.. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’’ అంటూ నటాషా స్టాంకోవిక్ ఉద్వేగపూరిత వాక్యాలు షేర్ చేసింది.అందుకే విడాకులు?అయితే, ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి పట్ల నటాషాకు ఇంకా ప్రేమ ఉందని.. కానీ అతడే దానిని నిలబెట్టుకోలేకపోయాడని.. ఏదేమైనా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా హార్దిక్‌కు నచ్చినట్లుగా మారడానికి నటాషా ఎంతో ప్రయత్నించిందని.. అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విడాకులు తీసుకుందని ఇటీవల ఆమె సన్నిహితవర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. హార్దిక్‌తో విడిపోయిన తర్వాత నటాషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా సెర్బియాకు చెందిన నటాషా మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆమె ఓ పార్టీలో హార్దిక్‌ను కలిసింది. స్నేహం కాస్తా ప్రేమగా మారగా పెళ్లిపీటలెక్కారు. అధికారికంగా ప్రకటించిఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే హార్దిక్- నటాషా కొన్నాళ్ల క్రితం తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల తర్వాత కొడుకును తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే, ఈ మాజీ జంట ఇన్‌స్టాలో తాము కలిసి ఉన్న, తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేయకపోవడం గమనార్హం.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
మాటల్లో వర్ణించలేను.. లవ్ యూ: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్‌కప్ చాంపియన్. ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవుఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.ముక్కలైన బంధంకాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది. అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.కుమారుడిపై ప్రేమఅనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్. ఇక ఇటీవల అగస్త్యతో కలిసి నటాషా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ పాండ్యా హార్ట్ సింబల్స్‌తో తన ప్రేమను తెలిపాడు. చదవండి: Ind vs SL ODIs: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
షారుక్ కొడుకే కాదు కూతురు కూడా లవ్‌లో పడింది! ప్రియుడెవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోపక్క అతడి కొడుకు హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా లవ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో సుహానా ప్రేమలో మునిగి తేలుతోందట. ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకలో కుటుంబసభ్యులందరి ముందుకు సుహానాను తన ప్రేయసిగా పరిచయం చేశాడట అగస్త్య. కాగా వీరిద్దరూ ద ఆర్చీస్ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జోయా అఖ్తర్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్ బర్డ్స్ తమ ప్రేమ విషయాన్ని ఇప్పుడప్పుడే బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదట. ఇకపోతే కొడుకు ప్రేమకు అప్పుడే పచ్చజెండా ఊపేసిందట శ్వేతా బచ్చన్. మరి వీరి లవ్ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి! చదవండి: దొంగతనం చేస్తూ దొరికిపోయిన బిగ్‌బాస్ విన్నర్ -
నా సర్వస్వం.. పాండ్యా- అగస్త్య
-
అగస్త్య నందాను అన్‌ఫాలో చేసిన సుహానా
అమితాబ్ బచ్చన్ మనువడు అగస్త్య నందా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో అతను బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అని అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. రెండు రోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన అగస్త్యకు అప్పడే దాదాపు 48 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్, కరిష్మా కపూర్ సహా పలువురు స్టార్ నటీనటులు ఉన్నారు. అయితే ఇటీవలే అతడున పోస్ట్ చేసిన వరుస ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లతో అగస్త్య పేరు తెగ ట్రెండ్ అవుతోంది. (కేబీసీ: కంటెస్టెంట్ జోక్‌కు ఆగ్రహించిన బిగ్‌బీ ) చిన్ననాటి ఫోటోలు సహా అగస్త్య ఇప్పటి వరకు 12 పోస్టులను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వాటిలో ఓ ఫోటోకు సంబంధించి షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ స్పందిస్తూ అన్‌ఫాలో అని కామెంట్ చేయడం ఇప్పుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. చిన్నప్పటి నుంచి వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కాగా సుహానా అన్ఫాల్ ఎందుకు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక మరో పోస్టులో నేను కృషిని నమ్ముతాను కానీ అదృష్ణాన్ని కాదంటూ అగస్త్య ఓ ఫోటో షేర్ చేయగా అసలు నీ ఉద్దేశం ఏంటో వివరించాలంటూ సోదరి నవ్యా నందా, ఆలియా భట్ కామెంట్ చేయడంతో అగస్త్య పేరు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక శ్వేతనందా, నిఖిల్ నందా కుమారుడైన అగస్త్య ఇటీవలే లండన్‌లోని సెవెనోక్స్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. (భాయ్ ‘మన్నత్’ను అమ్మేస్తున్నారా.. షారుఖ్ రిప్లై! ) View this post on Instagram A post shared by Agastya Nanda (@agastya.nanda) on Oct 26, 2020 at 12:39pm PDT