టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత విరామం తీసుకున్న ఈ ఆల్‌రౌండర్ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తనకు తాను సమయం కేటాయించుకుని ప్రకృతి అందాల్లో సేద తీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.
సింగర్‌తో ప్రేమలో?
ఈ క్రమంలో పాండ్యా ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోల్లోని లొకేషన్.. బ్రిటిష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా దిగిన ఫొటోల లొకేషన్ ఒకేలా ఉండటంతో వీరిద్దరు కలిసే అక్కడకు వెళ్లారనే వదంతులు వ్యాపించాయి. దీంతో హార్దిక్ మరోసారి ప్రేమలో పడ్డాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ప్రేమను నిర్వచిస్తూ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.
ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు
‘‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. ప్రేమలో ద్వేషం, అసూయ ఉండవు. గొప్పలు చెప్పుకోవడాలూ ఉండవు. ఇతరులను కించపరచడం, స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పొప్పులను లెక్కకడుతూ కోపం ప్రదర్శించదు. ప్రేమంటే నిజం.. నమ్మకం.. ఆశ.. రక్షణ.. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’’ అంటూ నటాషా స్టాంకోవిక్ ఉద్వేగపూరిత వాక్యాలు షేర్ చేసింది.
అందుకే విడాకులు?
అయితే, ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి పట్ల నటాషాకు ఇంకా ప్రేమ ఉందని.. కానీ అతడే దానిని నిలబెట్టుకోలేకపోయాడని.. ఏదేమైనా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా హార్దిక్‌కు నచ్చినట్లుగా మారడానికి నటాషా ఎంతో ప్రయత్నించిందని.. అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విడాకులు తీసుకుందని ఇటీవల ఆమె సన్నిహితవర్గాలు వెల్లడించాయి.
మరోవైపు.. హార్దిక్‌తో విడిపోయిన తర్వాత నటాషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా సెర్బియాకు చెందిన నటాషా మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆమె ఓ పార్టీలో హార్దిక్‌ను కలిసింది. స్నేహం కాస్తా ప్రేమగా మారగా పెళ్లిపీటలెక్కారు.
అధికారికంగా ప్రకటించి
ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే హార్దిక్- నటాషా కొన్నాళ్ల క్రితం తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల తర్వాత కొడుకును తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే, ఈ మాజీ జంట ఇన్‌స్టాలో తాము కలిసి ఉన్న, తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment