చీటర్‌.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్‌ పాం‍డ్యాను ఉద్దేశించేనా? | Natasa Stankovic Likes Posts On Cheating After Divorce With Hardik Pandya Viral | Sakshi
Sakshi News home page

చీటర్‌.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్‌ పాం‍డ్యాను ఉద్దేశించేనా?

Published Tue, Aug 13 2024 3:40 PM | Last Updated on Tue, Aug 13 2024 4:22 PM

Natasa Stankovic Likes Posts On Cheating After Divorce With Hardik Pandya Viral

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్‌ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్‌పూల్‌ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ ‘చీటర్‌’ అన్న పోస్టుకు లైక్‌ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.

నటాషాపై విమర్శలు
కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. టీ20 ప్రపంచకప్‌-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్‌తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.

తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్‌ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. హార్దిక్‌ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.

ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్‌నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్‌ వాటికి హార్ట్‌ సింబల్‌ జోడిస్తూ లైక్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్‌ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.

చీటర్‌.. ఆ పోస్టులకు నటాషా లైక్‌
‘‘చీటర్‌.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్‌స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్‌ లైక్‌ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్‌ ఫ్యాన్స్‌ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.

కాగా ప్రపంచకప్‌-2024 తర్వాత హార్దిక్‌ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్‌కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్‌లో 3-0తో టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement