ఆమె వేసుకున్న షూస్‌ ఖరీదు ఎంతో తెలుసా..? | Suhana Khan latest photos | Sakshi
Sakshi News home page

ఆమె వేసుకున్న షూస్‌ ఖరీదు ఎంతో తెలుసా..?

Oct 24 2017 1:17 PM | Updated on Oct 25 2017 11:44 AM

Suhana Khan latest photos

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌, సైఫ్‌ కూతురు సరా అలీఖాన్‌ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్‌ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్‌ గర్ల్స్‌ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా.. లెటెస్ట్‌ స్టైల్‌ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం తీసిపోదు.

తాజాగా ఈ టీనేజ్‌ బ్యూటీ దీపావళి సందర్భంగా ముంబైలో సందడి చేసింది. తన స్నేహితులు ఆహనా పాండే, షనాయ కపూర్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. ప్లెయిన్‌ వైట్‌ స్లీవ్‌లెస్‌ టీ, రిపెడ్‌ జీన్స్‌ వేసుకున్న ఈ అమ్మడు చూపరుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సుహానా వేసుకున్న స్నీకర్స్‌ (షూస్‌) అందరి దృష్టి ఆకర్షించాయి. గ్యిసెప్‌ జానొట్టి కంపెనీకి చెందిన 'జెన్నిఫర్‌' వెడ్జ్‌ స్నీకర్స్‌ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 995 డాలర్లు. అంటే రూ. 64వేలు అన్నమాట. ఈ మొత్తం డబ్బుంటే ఒకసారి హాయిగా థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లిరావొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement