సాథ్ నిభానా సాథియా -2తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా జైన్. ఆమె ప్రస్తుతం 'జనమ్ జనమ్ కా సాత్ షో'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. మొదట్లో సరైన అవకాశాలు ఎన్నోసార్లు మానసికంగా దెబ్బతిన్నానని చెప్పుకొచ్చింది. స్నేహా ఇప్పటికే క్రైమ్ పెట్రోల్, కృష‍్ణదాసి, క్రైమ్ పెట్రోల్ డయల్ 100 లాంటి సిరీస్‌ల్లో కనిపించింది.
(ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్)
స్నేహా జైన్ మాట్లాడుతూ.. 'నాకు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. మొదట యాక్టింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశా. ఆ తర్వాత క్రాఫ్ట్ బాగా నేర్చుకునేందుకు థియేటర్ కోర్సు కూడా చేశా. నా పాత్రలు ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేసుకోవాలనుకున్నా. మొదట కొన్ని పాత్రలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కెరీర్ ప్రారంభంలో నాకు స్నేహితుల పాత్రలు వచ్చినందున డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు రోజుకు కేవలం రూ.2 వేలే ఇచ్చేవారు. నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకునేదాన్ని. ఆ రోజులు నాకు జీవితమంటే చాలా నేర్పించాయి. ఇప్పటికీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నా. ఈ పరిశ్రమలో అంతులేని పోరాటంగా భావిస్తున్నా.'అని చెప్పుకొచ్చింది.
(ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!)
Comments
Please login to add a commentAdd a comment