సాక్షి, హైదరాబాద్: ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. న్యూబోయిగూడ కట్టెలమండిలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోదాంలో మార్చి 23న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది ఘటనా స్థలంలోనే సజీవ దహనం అయిన ఘటన విధితమే. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న బిహార్‌కు చెందిన మరో కార్మికుడు ప్రేమ్(20) తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరాడు.
ఈ క్రమంలో ప్రేమ్ వేడిపొగ పీల్చడంతో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం అతడు మృతి చెందాడు. బిహార్ రాష్ట్రం చాప్ర జిల్లా పాస్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని అజాంపూర్‌కు చెందిన రాధాకిషన్ కుమారుడు ప్రేమ్ అని పోలీసులు గుర్తించారు. ప్రేమ్ మరణంతో అగ్నిప్రమాద మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రేమ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు.
చదవండి: కాల్చుకు తిన్నారు! సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment