యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టు ఆదేశం | Uttarakhand Hc Directs State Govt Rs 35 Lakh Acid Attack Survivor | Sakshi
Sakshi News home page

యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు చెల్లించాలి.. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు..

Published Sat, Dec 17 2022 6:22 PM | Last Updated on Sat, Dec 17 2022 6:22 PM

Uttarakhand Hc Directs State Govt Rs 35 Lakh Acid Attack Survivor - Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమెకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని 2017లోనే చెప్పింది న్యాయస్థానం.

యూఎస్ నగర్ జిల్లాకు చెందిన ఈ యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు.

అయితే బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్‌లో పేర్కొంది.

వాదనలు విన్న న్యాయస్థానం యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు.
చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement