న్యూఢిల్లీ: 'నేనొక ట్యూబర్కులోసిస్ (క్షయవ్యాధి) రోగిని. కానీ, సురక్షితంగా భయటపడ్డాను. త్వరలోనే భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను క్షయవ్యాధి బారినపడి బయటపడిని కాబట్టే ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నడుంకట్టానని అన్నారు. త్వరలోనే ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో బచ్చన్ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'నువ్వెందుకు ఈ వ్యాధి విషయంలో సేవలు అందిస్తున్నావని నన్ను ఎంతోమంది అడిగారు. కానీ దీని వెనుక ఓ మెడికల్ హిస్టరీ ఉంది. ప్రచారం చేయడానికి కారణమేమిటంటే నేను ఈ వ్యాధి బారినపడి బయటపడ్డాను. 2000లో నాకు టీబీ ఉందని తెలిసింది. దీంతో దాదాపు సంవత్సరంపాటు వైద్య చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఉన్నాను' అని అమితాబ్ అన్నారు.
దీంతోపాటు 'నాకు వెన్నెముకతో సంబంధం ఉన్న టీబీ కావడంతో చాలా అసౌకర్యంగా అనిపించేది. కూర్చోలేకపోయేవాడిని. సరిగా కిందికి నడుంవాల్చలేకపోయేవాడిని. ఆ గేమ్ షో నిర్వహించే సమయంలో రోజుకు ఎనిమిది నుంచి 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఈ విషయం బయటకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది. నేను పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకొని నా మనుమరాలు ఆరాధ్యతో చక్కగా ఆడుకోగలుగుతున్నాను. త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది' అని అమితాబ్ చెప్పారు.
అమితాబ్ సంచలన ప్రకటన
Published Tue, Mar 8 2016 10:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement