అలా అడిగితే చాలా ఇబ్బంది పడ్డా: అమితాబ్ | People calling India land of rapes embarrassing: Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

అలా అడిగితే చాలా ఇబ్బంది పడ్డా: అమితాబ్

Published Fri, Sep 16 2016 7:09 PM | Last Updated on Sat, Sep 15 2018 8:03 PM

అలా అడిగితే చాలా ఇబ్బంది పడ్డా: అమితాబ్ - Sakshi

అలా అడిగితే చాలా ఇబ్బంది పడ్డా: అమితాబ్

న్యూఢిల్లీ: నేను విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి వాళ్లు భారతదేశం గురించి అడిగిన ప్రశ్నలకు చాలా ఇబ్బంది పడ్డానని బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఇండియాను వాళ్లు 'లాండ్ ఆఫ్ రేప్' గా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని చెప్పారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు చాలా బాధాకరమని, ఈ పరిస్థితి పోవాలన్నారు. అమితాబ్ నటించిన  'పింక్' సినిమా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఏ ఒక్క ప్రాంతం మహిళలకు సురక్షితంగా ఉందని  చెప్పలేమన్నారు. ఏ నగరంలో మహిళపై దాడి జరిగినా  దేశం మొత్తం బాధపడే రోజు రావాలన్నారు. మన మంతా కష్ట పడి దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్త్రీల పట్ల వివక్షను తన తాజా సినిమా పీకు లో చూపించామని అన్నారు. అమితాబ్ మహిళలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించారు. ఈసినిమా సెప్టెంబర్ 16 న విడుదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement