మళ్లీ వివాదం: అమితాబ్‌పై కేసు | FIR Registered Against Amitabh And KBC Show Makers For A Question | Sakshi
Sakshi News home page

మళ్లీ వివాదం: అమితాబ్‌పై ఎఫ్‌ఐఆర్‌

Published Mon, Nov 2 2020 6:25 PM | Last Updated on Mon, Nov 2 2020 8:15 PM

FIR Registered Against Amitabh And KBC Show Makers For A Question - Sakshi

న్యూఢిల్లీ : కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ’ సీజన్‌ 12 తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారపు కరమ్‌ వీర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీలను.. 6,40,000 ప్రశ్నను అడిగారు. ( రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?)

  • డిసెంబర్‌ 25, 1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు’’ 
    ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి

అయితే ప్రశ్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిగ్‌బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement