
జకార్తా: పారా ఆసియా క్రీడల తొలి రోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇందులో రెండు రజతాలతో పాటు మూడు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 49 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ బాషా 128 కేజీల బరువెత్తి రజతం సొంతం చేసుకోగా... పరమ్‌జీత్ కుమార్ (127 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు.
మహిళల 100 మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో భారత స్విమ్మర్ దేవాన్షి రజతం సాధించగా... పురుషుల 200 మీ. మెడ్లేలో సుయశ్ జాదవ్ కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సెమీస్‌లో 1–2తో మలేసియా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.