వేలాది మంది సైనికులు, వందలాది పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. కోట్ల సంపద కాలి బూడిదవుతోంది. అందమైన నగరాలు స్మశానాలుగా మారుతున్నాయి. ఇవన్నీ రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో నెలకొన్న కళ్లు చెమర్చే పరిస్థితులు. ఉక్రెయిన్-రష్యా పోరు 14 వ రోజూ(బుధవారానికి) కూడా కొనసాగుతోంది. అయితే తాము నాటో సభ్యత్వాన్ని కోరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేసిన నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందా.. అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
చర్చల ద్వారానే లక్ష్యాలు సాధిస్తాం
ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంపై రష్యా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ బలగాలు పనిచేయడం లేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం రష్యా మిలిటరీకి లేదని స్పష్టం చేసింది. తాము చర్చలకు ప్రాధాన్యత ఇస్తామని, చర్చల ద్వారానే లక్ష్యాలను సాధిస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రష్యా సైనిక చర్య పక్కా ప్రణాళిక పరంగా ముందుకు సాగుతోందన్నారు.
చదవండి: విషాదం.. రష్యాతో పోరులో ఉక్రెయిన్ స్టార్ హీరో మృతి.. షాక్‌లో అభిమానులు
కాల్పుల విరమణ
మరోవైపు ఉక్రెయిన్ బుధవారం ఆరు మానవతా కారిడార్లు ద్వారా పౌరులను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మానవతా కారిడార్‌ల వెంబడి కాల్పులు విరమణకి రష్యా సాయుధ దళాలు అంగీకరించాయి.
చదవండి: ఉక్రెయిన్‌కు రూ.77 కోట్ల విరాళం ప్రకటించిన స్టార్ హీరో
రష్యాతో మరో రౌండ్ చర్చలకు ఉక్రెయిన్ సిద్ధం
శాంతిని నెలకొల్పేందుకు రష్యాతో తదుపరి రౌండ్ చర్చలకు ఉక్రెయిన్ ప్రభుత్వం సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment