ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ శుక్రవారం దేశం విడిచి వెళ్లినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారని రష్యా మీడియా తెలిపింది. అయితే ఇంతకముందు కూడా జెలెన్‌స్కీ దేశం విడిచిపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నట్లు అనేక వీడియోలతో స్పష్టం చేశారు. మరీ ప్రస్తుత వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.
కాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అంతమొందించే దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం రోజుల్లోనే జెలెన్‌స్కీ హత్యకు మూడుసార్లు ప్రయత్నం జరిగినట్లు అంతర్జాతీయ వీడియో పేర్కొంది. అయితే ముందే అప్రమత్తమవ్వడం వల్ల ఉక్రెయిన్ భద్రతా దళాలు కుట్రలను భగ్నం చేసినట్లు తెలిపింది.
చదవండి: ‘నేనేమీ కొరకను.. ఎందుకు భయం’.. పుతిన్‌కు జెలెన్‌స్కీ చురకలు
కాగా జెలెన్‌స్కీ భద్రతా విషయంలో ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. . దేశం విడిచి వచ్చేయండి, రక్షణ కల్పిస్తామని అగ్రరాజ్యాలు ఆహ్వానం అందించినా కాదన్నారు. ఈ క్రమంలోనే దేశం విడిచి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా పిలుపునిచ్చిన్పటికీ జెలెన్‌స్కీ తిరస్కరించారు. యుద్ధ భూమిలోనే పూర్తి స్థాయి సైనికుడిగా మారిపోయారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడికి రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఫ్రాన్స్ దేశం కూడా ప్రకటించింది.
చదవండి: రష్యా విధ్వంసం.. మూడో విడత చర్యలకు ఉక్రెయిన్ యత్నం!
Comments
Please login to add a commentAdd a comment