యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ.. పోల్యాండ్‌కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్‌స్కీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు.
‘నేను ఇక్కడే కివీలోనే ఉన్నా. ఇక్కడి నుంచే పని చేస్తున్నా. ఎవరూ ఎక్కడికీ పారిపోలేదు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. జెలెన్‌స్కీ ఉక్రెయిన్ వదిలి పారిపోయాడని, పోల్యాండ్‌లో తలదాచుకున్నాడని రష్యా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. అతన్ని పట్టుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నించినా.. జాడ లేకుండా పోయాడని, బహుశా పోల్యాండ్‌లో జెలెన్‌స్కీ తలదాచుకుని ఉంటాడని వోలోదిన్ పేర్కొన్నాడు. అయితే..
ఈ క్రమంలోనే పిరికిపంద అపవాదుపై జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించాడు. పిరికిపందను కాను.. ఎవరూ ఎక్కడికి పారిపోరు అని వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు రష్యా పరిణామాలపై అజ్ఞాతంలో ఉంటూనే జెలెన్‌స్కీ స్పందిస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు, మీడియా ద్వారా పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment