గత తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం జరుగుతున్నా వెనకడుగు వేయకుండా అంతే స్థాయిలో ప్రతి దాడి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి గత వారం రోజుల్లో జెలెన్‌స్కీపై మూడు హత్యాయత్నాలు జరిగాయని, వీటన్నింటిని ఉక్రెయిన్ భద్రతా దళం తిప్పికొట్టిన్నట్లు వెల్లడించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అంతమొందించేందుకు రెండు వేరు వేరు గ్రూప్‌లు(వాగ్నర్ గ్రూప్, చెచెన్ తిరుగుబాటు దారులు) ప్లాన్ చేసినట్లు పేర్కొంది. అయితే జెలెన్‌స్కీని చంపడానికి కదిరోవ్ దళం.. చెచెన్యా హంతక ముఠాను రంగంలోకి దిగినట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) అప్రమత్తం చేయడంతో హత్యాయత్నాన్ని తిప్పి కొట్టగలిగామని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి డేనిలోవ్ తెలిపారు. చెచెన్యా నాయకుడు కదిరోవ్ దళంపై ముందుగానే నిఘా పెట్టడం వల్ల ప్రత్యేక ఆపరేషన్ ద్వారా హంతక ముఠాను మట్టుబెట్టామని పేర్కొన్నారు.
చదవండి: అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ
అలాగే ఉక్రెయిన్ రాజధాని కైవ్ శివార్లలో శనివారం చెచెన్ ప్రత్యేక దళాలు హతమయ్యాయని ఆయన తెలిపారు. కాగా ఇప్పటి వరకు రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో 1,500 కంటే ఎక్కువ సైనిక సౌకర్యాలను ధ్వంసం చేసింది. అంతేగాక 58 విమానాలు, 46 డ్రోన్‌లు, 472 ట్యాంకులతోపాటు ఇతర సాయుధ వాహనాలు ధ్వంసమయ్యాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ కోనాషెంకోవ్ తెలిపారు
చదవండి: రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు!
Comments
Please login to add a commentAdd a comment