Ukraine President Zelensky Vows To Rebuild Ukraine: తమ దేశం ప్రపంచ యుద్ధాలను, కరువులను, జనహననాన్ని తట్టుకొని నిలబడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గుర్తు చేశారు. తాజా సంక్షోభాన్ని కూడా తట్టుకొని నిలబడతామని, యుద్ధానంతరం తిరిగి దేశాన్ని పునర్నిర్మించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ భయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశçస్తులకు ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ఉక్రెయిన్‌కు జరిగిన నష్టాన్ని రష్యా భర్తీ చేయాల్సిఉంటుందని హెచ్చరించారు. ‘రెండు ప్రపంచ యుద్ధాలు, మూడుసార్లు కరువు, జనహననం, చెర్నోబిల్ విస్ఫోటనం, క్రిమియాపై దురాక్రమణను తట్టుకొని నిలిచాం. యుద్ధానంతరం దేశంలోని ప్రతి ఇల్లు, వీధి, నగరాన్ని పునరుద్ధరిస్తాం.’ అని చెప్పారు. రష్యా తమని నాశనం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమైందన్నారు.
ఇలాంటి సంక్షోభాలు చాలా చూశామని, ప్రస్తుత యుద్ధం చూసి ఉక్రేనియన్లు భయపడుతున్నారు, కుంగిపోయారు, లొంగిపోతున్నారు అని ఎవరైనా భావిస్తే వారికి తమ గురించి ఏమీ తెలియదని అర్థమని జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్ గురించి పుతిన్‌కు ఏమీ తెలియదన్నారు. రష్యా దాడిలో ఇంతవరకు దాదాపు 2వేల మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు స్వదేశీయులకు జెలెన్‌స్కీ ధైర్యం చెప్పారు. ఉక్రేనియన్లను ఎవరూ జయించలేరన్నారు.
(చదవండి: రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ)
Comments
Please login to add a commentAdd a comment