bulit
-
తట్టుకుని నిలబడతాం!... ఉక్రెయిన్‌ని పునర్నిర్మిస్తాం
Ukraine President Zelensky Vows To Rebuild Ukraine: తమ దేశం ప్రపంచ యుద్ధాలను, కరువులను, జనహననాన్ని తట్టుకొని నిలబడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తు చేశారు. తాజా సంక్షోభాన్ని కూడా తట్టుకొని నిలబడతామని, యుద్ధానంతరం తిరిగి దేశాన్ని పునర్నిర్మించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ భయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశçస్తులకు ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్‌కు జరిగిన నష్టాన్ని రష్యా భర్తీ చేయాల్సిఉంటుందని హెచ్చరించారు. ‘రెండు ప్రపంచ యుద్ధాలు, మూడుసార్లు కరువు, జనహననం, చెర్నోబిల్ విస్ఫోటనం, క్రిమియాపై దురాక్రమణను తట్టుకొని నిలిచాం. యుద్ధానంతరం దేశంలోని ప్రతి ఇల్లు, వీధి, నగరాన్ని పునరుద్ధరిస్తాం.’ అని చెప్పారు. రష్యా తమని నాశనం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమైందన్నారు. ఇలాంటి సంక్షోభాలు చాలా చూశామని, ప్రస్తుత యుద్ధం చూసి ఉక్రేనియన్లు భయపడుతున్నారు, కుంగిపోయారు, లొంగిపోతున్నారు అని ఎవరైనా భావిస్తే వారికి తమ గురించి ఏమీ తెలియదని అర్థమని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ గురించి పుతిన్‌కు ఏమీ తెలియదన్నారు. రష్యా దాడిలో ఇంతవరకు దాదాపు 2వేల మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు స్వదేశీయులకు జెలెన్స్కీ ధైర్యం చెప్పారు. ఉక్రేనియన్లను ఎవరూ జయించలేరన్నారు. (చదవండి: రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ) -
నకిలీ బైబిల్ మిషన్ మందిర నిర్మాణం
అధికారులకు ఫిర్యాదు చేస్తాం సమైక్య కాపర్ల సహవాసం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ రెవరెండ్ పీబీ రవికుమార్ పెదకాకాని: బైబిల్ మిషన్ పేరుతో హాఫ్‌పేట వద్ద నిర్మిస్తున్న మందిరం నకిలీ మందిరమని, భక్తులను తప్పుదారి పట్టించేందుకే నకిలీ ప్రార్థనామందిరం నిర్మిస్తున్నారని గుంటూరు సమైక్య కాపర్ల సహవాసం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ రెవరెండ్ పిబి రవికుమార్ అన్నారు. పెదకాకాని బైబిల్‌మిషన్ స్వస్థిశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 17 ఏళ్ళుగా 850 క్రైస్తవ సంఘాలతో కలసి 12 మంది సభ్యులతో యునైటెడ్ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. బైబిల్‌మిషన్ కేంద్రంగా పెదకాకాని స్వస్థిశాల ఉందన్నారు. బైబిల్ మిషన్ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె. శామ్యేల్కిరణ్ అనుమతి లేకుండా, బైబిల్ మిషన్ పేరుతో దైవజనులు దేవదాసు అయ్యగారి ఫోటోలు వాడుకుంటూ బాషా అనే వ్యక్తి హాఫ్‌పేట వద్ద నిర్మిస్తున్న మందిరం నకిలీ మందిరంగా పేర్కొన్నారు. భాషా అనే వ్యక్తికి బైబిల్మిషన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. గుంటూరు సమైక్య కాపర్ల సహవాసం అధ్యక్షుడు వై. పృథ్వీరాజ్ మాట్లాడుతూ బైబిల్‌మిషన్ అనుమతులు లేకుండా అదే పేరుతో కోట్లాదిరూపాలయతో నిర్మాణాలు చేయడం, ఫోటోలు వాడుకోవడం చట్టరీత్యానేరమన్నారు. దీనిపై సోమవారం జిల్లా కలెకర్, ఎస్పీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో బైబిల్‌మిషన్ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె శామ్యేల్కిరణ్ పాల్గొన్నారు.