నకిలీ బైబిల్ మిషన్ మందిర నిర్మాణం
నకిలీ బైబిల్ మిషన్ మందిర నిర్మాణం
Published Sat, Aug 6 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
అధికారులకు ఫిర్యాదు చేస్తాం
సమైక్య కాపర్ల సహవాసం వ్యవస్థాపక
అధ్యక్షుడు ప్రొఫెసర్ రెవరెండ్ పీబీ రవికుమార్
పెదకాకాని: బైబిల్ మిషన్ పేరుతో హాఫ్‌పేట వద్ద నిర్మిస్తున్న మందిరం నకిలీ మందిరమని, భక్తులను తప్పుదారి పట్టించేందుకే నకిలీ ప్రార్థనామందిరం నిర్మిస్తున్నారని గుంటూరు సమైక్య కాపర్ల సహవాసం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ రెవరెండ్ పిబి రవికుమార్ అన్నారు. పెదకాకాని బైబిల్‌మిషన్ స్వస్థిశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 17 ఏళ్ళుగా 850 క్రైస్తవ సంఘాలతో కలసి 12 మంది సభ్యులతో యునైటెడ్ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. బైబిల్‌మిషన్ కేంద్రంగా పెదకాకాని స్వస్థిశాల ఉందన్నారు. బైబిల్ మిషన్ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె. శామ్యేల్‌కిరణ్ అనుమతి లేకుండా, బైబిల్ మిషన్ పేరుతో దైవజనులు దేవదాసు అయ్యగారి ఫోటోలు వాడుకుంటూ బాషా అనే వ్యక్తి హాఫ్‌పేట వద్ద నిర్మిస్తున్న మందిరం నకిలీ మందిరంగా పేర్కొన్నారు. భాషా అనే వ్యక్తికి బైబిల్‌మిషన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. గుంటూరు సమైక్య కాపర్ల సహవాసం అధ్యక్షుడు వై. పృథ్వీరాజ్ మాట్లాడుతూ బైబిల్‌మిషన్ అనుమతులు లేకుండా అదే పేరుతో కోట్లాదిరూపాలయతో నిర్మాణాలు చేయడం, ఫోటోలు వాడుకోవడం చట్టరీత్యానేరమన్నారు. దీనిపై సోమవారం జిల్లా కలెకర్, ఎస్పీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో బైబిల్‌మిషన్ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె శామ్యేల్‌కిరణ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement