bible mission
-
బైబిల్ మిషన్‌కు ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు, రెగ్యులర్ ప్యాసింజర్లకు అదనపు బోగీలు విజయవాడ వరకు వచ్చే కొన్ని రైళ్లు గుంటూరు వరకు పొడిగింపు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు నాగార్జున నగర్ స్టేషన్లో హాల్ట్ గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ ఎదుట నాగార్జున నగర్లో జనవరి 26 నుంచి 29 వరకు జరిగే బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చే భక్తులకు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నం: 07223 కాకినాడ– గుంటూరు ప్రత్యేక ప్యాసింజర్ రైలు జనవరి 26 తేదీన కాకినాడలో 05.30కి బయలు దేరి గుంటూరుకు 12.50కి చేరుకుంటుందని తెలిపారు. ట్రైన్ నం: 07224 గుంటూరు – కాకినాడ ప్రత్యేక ప్యాసింజర్ రైలు జనవరి 29న గుంటూరులో 13.50కి బయలుదేరి కాకినాడకు మరుసటి రోజు 10.40 కి చేరుకుంటుందని పేర్కొన్నారు. ట్రైన్ నం: 07250 గుంటూరు విజయవాడ ప్రత్యేక ప్యాసింజరు రైలు జనవరి 27, 28 తేదీల్లో గుంటూరులో 11.15కి బయలుదేరి విజయవాడకు 12.15కి చేరుకుంటుందని తెలిపారు. జనవరి 26 నుంచి 29 వరకు ట్రైన్ నం: 57317/57318 మాచర్ల– భీమవరం, గుంటూరు– మాచర్ల, ట్రైన్ నం: 57316 నర్సాపూర్– గుంటూరు, ట్రైన్ నం: 57582/57381 నర్సాపూర్– గుంటూరు – నర్సాపూర్, ట్రైన్ నం: 57327 డోన్– గుంటూరు ప్యాసింజర్ రైళ్లకు రద్దీకి అనుగుణంగా ఒకటి లేదా రెండు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 26 నుంచి 29 వరకు ట్రైన్ నం 57226/57225 విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం ప్యాసింజర్, జనవరి 27, 28 తేదీల్లో ట్రైన్ నం: 57232/57231 కాకినాడ పోర్టు విజయవాడ కాకినాడ పోర్టు ప్యాసింజరు, జనవరి 27, 28 తేదీల్లో ట్రైన్ నం : 57272 రాయగఢ్ విజయవాడ ప్యాసింజరు రైలును గుంటూరు వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జనవరి 26 నుంచి 29 వరకు ట్రైన్ నం : 17201/17202 గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు గొల్కొండ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం : 17239/17240 గుంటూరు విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు, విజయవాడ వైపునకు, గుంటూరు వైపునకు ప్రయాణించే అన్ని ప్యాసింజర్ రైళ్లకు నాగార్జున నగర్ రైల్వే హాల్ట్ స్టేషన్లో రెండు నిమిషాలు తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైన్ నం : 07434 సికింద్రాబాద్ కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో జనవరి 25 వ తేదీన బయలుదేరి కాకినాడ పోర్టుకు మరుసటి రోజు 05.15కి చేరుకుంటుందని తెలిపారు. ఇది డివిజను పరిధిలో నల్గొండ 21.05/21.06, మిర్యాలగూడ 21.32/21.33, పిడుగురాళ్ల 22.32/22.33, సత్తెనపల్లి 23.07/23.08, గుంటూరు మరుసటి రోజు 00.30/00.35కి వచ్చి బయలుదేరుతుందని తెలిపారు. ట్రైన్ నం : 07435 కాకినాడ టౌన్ సికింద్రాబాద్ ప్రత్యేక రైలు జనవరి 29వ తేదీన కాకినాడ టౌన్లో 18.10కి బయలుదేరి సికింద్రాబాద్‌కు మరుసటిరోజు 05.00కి చేరుకుంటుందని తెలిపారు. ఇది డివిజను పరిధిలో గుంటూరు 23.00/23.05, సత్తెనపల్లి 23.48/23.50, పిడుగురాళ్ల మరుసటిరోజు 00.10/ 00.12, మిర్యాలగూడ 01.10/01.12, నల్గొండ 01.45/01.47కి వచ్చి బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఈ రైలు రిజర్వేషన్ ప్రయాణికుల కోసం రెండు త్రీటైర్ ఏసీ, పది స్లీపర్ కోచ్‌లు, సాధారణ ప్రయాణికుల కోసం రెండు జనరల్, రెండు ఎస్ఎల్ఆర్ కోచ్‌లతో నడుస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు సూచించారు. -
బైబిల్ మిషన్ రిజిస్టర్డ్ సంస్థ
బైబిల్ మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్‌రజాక్ బాషా గుంటూరు ఈస్ట్ : భారత్‌పేటలో కేంద్ర కార్యాలయంగా నిర్వహిస్తున్న బైబిల్ మిషన్ రిజిస్టర్డ్ సంస్థని బైబిల్ మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్ రజాక్‌బాషా తెలిపారు. బైబిల్‌మిషన్ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి మండలం హాఫ్‌పేట వద్ద తమ సంస్థ నిర్మిస్తున్న దైవ మందిరాన్ని ప్రస్తావిస్తూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తమ సంస్థ ఏపీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీ నంబరు 311/2015 పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. తమ సంస్థపై అసత్య ప్రచారాలు చేయడాన్ని మానుకోవాలని హితవుపలికారు. తమపై విమర్శలు గుప్పిస్తున్న సంస్థ రిజిస్ట్రేషన్ కాలేదని వివరించారు. అటువంటివారిపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సంస్థ రిజిస్ట్రేషన్ పత్రాన్ని ప్రదర్శించారు. -
నకిలీ బైబిల్ మిషన్ మందిర నిర్మాణం
అధికారులకు ఫిర్యాదు చేస్తాం సమైక్య కాపర్ల సహవాసం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ రెవరెండ్ పీబీ రవికుమార్ పెదకాకాని: బైబిల్ మిషన్ పేరుతో హాఫ్‌పేట వద్ద నిర్మిస్తున్న మందిరం నకిలీ మందిరమని, భక్తులను తప్పుదారి పట్టించేందుకే నకిలీ ప్రార్థనామందిరం నిర్మిస్తున్నారని గుంటూరు సమైక్య కాపర్ల సహవాసం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ రెవరెండ్ పిబి రవికుమార్ అన్నారు. పెదకాకాని బైబిల్‌మిషన్ స్వస్థిశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 17 ఏళ్ళుగా 850 క్రైస్తవ సంఘాలతో కలసి 12 మంది సభ్యులతో యునైటెడ్ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. బైబిల్‌మిషన్ కేంద్రంగా పెదకాకాని స్వస్థిశాల ఉందన్నారు. బైబిల్ మిషన్ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె. శామ్యేల్కిరణ్ అనుమతి లేకుండా, బైబిల్ మిషన్ పేరుతో దైవజనులు దేవదాసు అయ్యగారి ఫోటోలు వాడుకుంటూ బాషా అనే వ్యక్తి హాఫ్‌పేట వద్ద నిర్మిస్తున్న మందిరం నకిలీ మందిరంగా పేర్కొన్నారు. భాషా అనే వ్యక్తికి బైబిల్మిషన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. గుంటూరు సమైక్య కాపర్ల సహవాసం అధ్యక్షుడు వై. పృథ్వీరాజ్ మాట్లాడుతూ బైబిల్‌మిషన్ అనుమతులు లేకుండా అదే పేరుతో కోట్లాదిరూపాలయతో నిర్మాణాలు చేయడం, ఫోటోలు వాడుకోవడం చట్టరీత్యానేరమన్నారు. దీనిపై సోమవారం జిల్లా కలెకర్, ఎస్పీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో బైబిల్‌మిషన్ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె శామ్యేల్కిరణ్ పాల్గొన్నారు. -
ప్రేమతో మనుగడ సాగించాలి
-
ప్రపంచ శాంతి కోసం ప్రార్థన
ద్యాత్మిక శాంతిని పొందడానికి, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని బైబిల్ మిషన్ మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె.శామ్యూల్ కిరణ్ అన్నారు. దైవజనులు ఎం.దేవదాస్ అయ్యగారికి బయలుపరిచిన 76వ బైబిల్ మిషన్ మహోత్సవాలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ మహోత్సవాల ఆశీర్వాదాలను తమతో పాటు పొరుగువారికి కూడా అందించాలని సూచించారు. ప్రతి భక్తుడు దే వుని కృపకు పాత్రులై జీవించాలన్నారు. కుల,మత, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా ఒకే పందిరిలో ఇంతమంది ఐక్యతానురాగాలతో మూడు రోజుల పండుగ వాతావరణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. మహోత్సవాలు విజయవంతం కావడానికి తోడ్పాటు నందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండల పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వేసిన పందిళ్లలో గత మూడు రోజులుగా జరిగిన మహోత్సవాలకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. చివరిరోజు తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతికి చెందిన డాక్టర్ డేనియల్ దినకర్ ధ్యాన ప్రార్థనలతో దినచర్యలు ప్రారంభించారు. ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక సంఘాలకు చెందిన రెవరెండ్లు కె.శ్యాంకిషోర్, సీఎస్ఐ బిషప్, జి. దైవాశీర్వాదం, సైమన్ హక్ వాక్యోపదేశం చేశారు. పందిళ్ల ప్రాంగణం భక్త జన సంద్రంలా మారింది. బైబిల్ మిషన్ మహోత్సవాల నివేదికను వివరించారు. ప్రముఖుల రాక : బైబిల్ మిషన్ మహోత్సవాల ముగింపురోజు బుధవారం పలువురు ప్రముఖులు హాజరై దేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు -1 ఎమ్మెల్మే షేక్ మస్తాన్ వలి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు, యూత్ గాస్పెల్ టీమ్ సభ్యులు, రెవరెండ్లు, యాజకులు,సేవకులు పాల్గొనగా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎన్.సత్యానందం, కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్, సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.యేసురత్నం, స్త్రీల సభల కన్వీనర్ డాక్టర్ ప్రమీలా సెల్వరాజ్ దేవుని నామమున అతిథులకు ఆశీర్వచనాలు అందజేశారు.కాకాని తోటలో పోటెత్తిన భక్తులు: పెదకాకాని తోటలో మూడు రోజులుగా భక్తులు పోటెత్తారు. బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని తోటకు చేరుకుని తోట ప్రాంగణంలో ఉన్న ఎం.దేవదాసు అయ్యగారికి, రెవరెండ్ డాక్టర్ జె.జాన్ సెల్వరాజ్ మహిమ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకట్టుకున్న ప్రమీలా సెల్వరాజ్ బృందం భక్తిగీతాలు దివ్య దేవుడు దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, క్రీస్తు ప్రభువు రక్షించునుగాక అంటూ తమ మధురమైన స్వరంతో దైవ భక్తిగీతాలను స్త్రీల సభల కన్వీనర్ డాక్టర్ జె.ప్రమీల సెల్వరాజ్, రీనా శామ్యేల్ బృందం ఆలపించారు. బైబిల్ మిషన్ మహాసభల అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ ఎన్. సత్యానందం అధ్యక్షత వహించి వాక్యోపదేశం చేశారు. సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు పాపాలు ఒప్పుదల, బాప్తిస్మములు, అన్నప్రాస, నామకరణలు చేయగా జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.యేసురత్నం విశ్వాస ప్రమాణం, ముగింపు ప్రార్థన చే శారు. ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల పాటు మహోత్సవాలకు హాజరైన భక్తులు పండుగను జరుపుకుని, తిరిగి వారి గృహాలకు దేవుని దీవెనలతో అందుకుని ఆనందంతో వెనుదిరిగారు. ఆర్టీసి, రైల్వే శాఖ అధికారులు భక్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గుంటూరు, మంగళగిరి డిపోలకు చెందిన ఆర్టీసీ సర్వీసులను బైబిల్ మిషన్ మహోత్సవాల ప్రాంగణానికి మళ్లించారు. రైల్వే అధికారులు సమీపంలోని నాగార్జున నగర్ వద్ద తాత్కాలిక రైల్వే హాల్ట్ ఏర్పాటు చేసి రైళ్లను నడిపించారు. -
ప్రేమతో మనుగడ సాగించాలి: వైఎస్ షర్మిల
క్రీస్తును విశ్వసించిన వారికి కష్టాలు దూరం బైబిలు మిషన్ మహాసభల్లో వైఎస్ షర్మిల సాక్షి, గుంటూరు: మనిషిని దేవుడు ఎంతో ప్రేమగా పుట్టించాడనీ, అంతే ప్రేమగా ఆయనపై ప్రేమ, సమానత్వంతో మనుగడ సాగించాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రతి ఒక్కరూ పాపం నుంచి విముక్తిని పొందాలనీ, అప్పుడే దేవుడైన క్రీస్తును సులభంగా చేరగలమన్నారు. గుంటూరుకు సమీపంలోని నాగార్జుననగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి 76వ బైబిలు మిషన్ మహా సభల్లో ముఖ్య అతిథిగా షర్మిల లక్షలాది మంది దైవజనులనుద్దేశించి ప్రసంగించారు. నీతిమంతుడైన దేవుడు పాపులను పరిరక్షించి వారికి అన్ని విధాలా రక్షణ కలిగించేందుకే భువిపైకి వచ్చారన్నారు. మనుషుల్లో పెరిగిన పాప ప్రక్షాళన కోసం క్రీస్తు పడిన కష్టాలు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించాయన్నారు. ‘వైఎస్ కుటుంబం కోసం, జగనన్న విడుదలకు బైబిలు మిషన్ మహాసభల్లో ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వారందరికీ రాజన్న కుటుంబం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తోంద’ని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ పేరును ప్రస్తావించిన ప్రతిసారీ కరతాళధ్వనులు మిన్నంటాయి. ఆకట్టుకున్న బ్రదర్ అనిల్ వాక్యోపదేశం: బ్రదర్ అనిల్‌కుమార్ అందించిన క్రీస్తు వాక్యోపదేశాన్ని దైవజనులు ఆసక్తిగా ఆలకించారు. దేవుని స్తుతి గేయాలు, ప్రార్థనలతో ఈ వాక్యోపదేశం గంటన్నరసేపు సాగింది. అనంతరం బైబిలు మిషన్ నిర్వాహకులు రెవరెండ్ శామ్యూల్ కిరణ్, ఏసురత్నం, సత్యానందం తదితరులు వైఎస్ షర్మిల, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఆశీర్వాదాలు అందజేశారు. -
ఐదు రైళ్లకు అదనపు బోగీలు
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాగార్జుననగర్‌లో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చే భక్తుల కోసం గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేశారు. పలు ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నర్సాపూర్-గుంటూరు మధ్య నడిచే ప్యాసింజర్ ైరె లుకు 26వ తేదీ నుంచి 29 వరకు ఏకంగా 10 జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు. కాకినాడ-విజయవాడ, నర్సాపూర్-గుంటూరు, గుంటూరు-మాచర్ల, డోన్-గుంటూరు స్టేషన్ల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లకు ఒకటి లేదా రెండు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైలును గుంటూరు స్టేషన్ వరకూ పొడిగించారు. ఈ బండికి సభలు జరిగే నాగార్జుననగర్ స్టేషన్లో హాల్టు కూడా కల్పించారు. అదేవిధంగా కాకినాడ-విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలుబండిని కూడా నాలుగు రోజుల పాటు గుంటూరు వరకూ నడపనున్నారు. గుంటూరు నుంచి వయా విజయవాడ మీదగా సికింద్రాబాద్ వరకూ నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు కూడా నాగార్జుననగర్స్టేషన్లో రెండు నిమిషాల హాల్టును ఏర్పాటు చే సినట్లు గుంటూరు రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు.