బైబిల్‌ మిషన్‌ రిజిస్టర్డ్‌ సంస్థ | Bible mission is a registered org | Sakshi
Sakshi News home page

బైబిల్‌ మిషన్‌ రిజిస్టర్డ్‌ సంస్థ

Published Sat, Aug 6 2016 10:14 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

బైబిల్‌ మిషన్‌ రిజిస్టర్డ్‌ సంస్థ

బైబిల్‌ మిషన్‌ రిజిస్టర్డ్‌ సంస్థ

బైబిల్‌ మిషన్‌ అధ్యక్షుడు 
రెవరెండ్‌ డాక్టర్‌ అబ్దుల్‌రజాక్‌ బాషా
 
గుంటూరు ఈస్ట్‌ : భారత్‌పేటలో కేంద్ర కార్యాలయంగా నిర్వహిస్తున్న బైబిల్‌ మిషన్‌ రిజిస్టర్డ్‌ సంస్థని బైబిల్‌ మిషన్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ డాక్టర్‌ అబ్దుల్‌ రజాక్‌బాషా తెలిపారు. బైబిల్‌మిషన్‌ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి మండలం హాఫ్‌పేట వద్ద తమ సంస్థ నిర్మిస్తున్న దైవ మందిరాన్ని ప్రస్తావిస్తూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తమ సంస్థ ఏపీ రిజిస్టర్‌ ఆఫ్‌ సొసైటీ నంబరు 311/2015 పేరుతో రిజిస్ట్రేషన్‌ అయిందని పేర్కొన్నారు. తమ సంస్థపై అసత్య ప్రచారాలు చేయడాన్ని మానుకోవాలని హితవుపలికారు. తమపై విమర్శలు గుప్పిస్తున్న సంస్థ రిజిస్ట్రేషన్‌ కాలేదని వివరించారు. అటువంటివారిపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సంస్థ రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని ప్రదర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement