రైతులకు ఏటా ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం
20 రోజులు ‘ఉపాధి’ పనులు చేసిన వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.12 వేలు
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: భూభారతి (ధరణి) పోర్ట ల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టా భూమి గల రైతులకు ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగి స్తారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసే ‘ఆర్‌ఓఎఫ్‌ఆర్’ పట్టాదారులకు సైతం రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. రైతులకు ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం అందించే రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు కానుండగా, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేలు సాయంగా అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు కానుంది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది.
డీబీటీ విధానంలో జమ
ఈ నెల 26వ తేదీ నుంచి మొదలుపెట్టి వ్యవ సాయ యోగ్యమైన భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున జమ చేయ నున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో అమలయ్యే ఈ పథకానికి సాయాన్ని ఆర్‌బీఐ నిర్వహించే ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీ టీ)’ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బాధ్యత తీసుకొంటారు. పథ కానికి సంబంధించిన లోటుపాట్లపై వ్యవసాయ సంచాలకులు ఎప్పటికప్పు డు తగిన చర్యలు తీసుకుంటారు. వ్య వసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిర త్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించేలా చూడటమే రైతుభరోసా ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.
10 లక్షల కుటుంబాలకు ఆత్మియ భరోసా!
‘ఇందిరమ్మ ఆత్మియ భరోసా’ పథకం కింద 10 లక్షల వ్యవసాయ కూలీ కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 29 లక్షల కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు. ఇందులో కనీసం 10 రోజులు పనిచేసిన కుటుంబాలు 11 లక్షలు ఉండగా, కనీసం ఒకరోజు పని చేసిన కుటుంబాలు 15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 20 రోజుల పనిని ప్రామాణికంగా తీసుకుంటే 10 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మియ భరోసా కింద లబ్ధి చేకూరే చాన్స్ ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,200 కోట్లు వెచ్చించనుంది.
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూ మిలేని వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించేందుకే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరో సా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లో నమోదు చేయబడి, 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి ప్రతి విడతకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయాన్ని డీబీటీ పద్ధతిలో కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ (కమిషనర్) నోడల్ విభాగంగా, జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment