బక్సర్: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక గాడిద మృతి అనంతరం గందరగోళం చెలరేగింది. ఇది పోలీసుల వరకూ చేరడంతో వారు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 65 మందిపై కేసు నమోదు చేశారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని కేసత్ బ్లాక్‌లో విద్యుదాఘాతం కారణంగా గాడిద మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలోనివారు ఆందోళనకు దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. ఈ దరిమిలా పోలీసులు 65 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభమ్ ఆర్య మీడియాకు తెలియజేస్తూ సంఘటన జరిగిన వెంటనే చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్‌కు చేరుకున్న పలువురు గ్రామస్తులు మృతిచెందిన గాడిదకు సంబంధించిన పరిహారం వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు గ్రామస్తులు పవర్ గ్రిడ్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీనియర్ అధికారి పోలీసులకు గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన 65 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..
Comments
Please login to add a commentAdd a comment