
న్యూఢిల్లీ: దేశీయంగా రిజిస్టరయిన సంస్థలు 28 లక్షల పైచిలుకు ఉండగా, వాటిలో 65 శాతం సంస్థలు (దాదాపు 18.1 లక్షలు) మాత్రమే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 9,43,934 సంస్థలు మూతబడ్డాయి. కంపెనీల చట్టం 2013 కింద నమోదు చేసుకున్న విదేశీ సంస్థలు 5,216 ఉండగా జనవరి నాటికి వాటిలో 3,281 సంస్థలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ విడుదల చేసిన నెలవారీ బులెటిన్‌లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రంగాలవారీగా చూస్తే అత్యధికంగా బిజినెస్ సర్వీసుల విభాగంలో 27 శాతం కంపెనీలు, తయారీ రంగంలో 20 శాతం, పర్సనల్..సోషల్ సర్వీసులు వంటి విభాగాల్లో 13 శాతం సంస్థలు పని చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో యాక్టివ్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉన్నాయి.
ఇదీ చదవండి: పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు
నిరుద్యోగం రేటు తగ్గుముఖం
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ప్రకారం.. 2024–25 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.4 శాతానికి వచ్చి చేరింది. జూలై–సెపె్టంబర్‌లోనూ ఇదే స్థాయిలో నమోదైంది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2024 అక్టోబర్–డిసెంబర్‌లో 8.1 శాతానికి తగ్గింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది. 2024 జూలై–సెపె్టంబర్‌లో ఈ రేటు 8.4 శాతం. ఇక పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంత క్రితం ఏడాది మాదిరిగానే 2024 అక్టోబర్–డిసెంబర్‌లో 5.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2024 జులై–సెప్టెంబర్‌లో ఇది 5.7 శాతం నమోదైంది.