ఐదు రైళ్లకు అదనపు బోగీలు
Published Tue, Jan 21 2014 11:52 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాగార్జుననగర్‌లో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చే భక్తుల కోసం గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేశారు. పలు ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నర్సాపూర్-గుంటూరు మధ్య నడిచే ప్యాసింజర్ ైరె లుకు 26వ తేదీ నుంచి 29 వరకు ఏకంగా 10 జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు. కాకినాడ-విజయవాడ, నర్సాపూర్-గుంటూరు, గుంటూరు-మాచర్ల, డోన్-గుంటూరు స్టేషన్ల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లకు ఒకటి లేదా రెండు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైలును గుంటూరు స్టేషన్ వరకూ పొడిగించారు. ఈ బండికి సభలు జరిగే నాగార్జుననగర్ స్టేషన్‌లో హాల్టు కూడా కల్పించారు. అదేవిధంగా కాకినాడ-విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలుబండిని కూడా నాలుగు రోజుల పాటు గుంటూరు వరకూ నడపనున్నారు. గుంటూరు నుంచి వయా విజయవాడ మీదగా సికింద్రాబాద్ వరకూ నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు కూడా నాగార్జుననగర్‌స్టేషన్‌లో రెండు నిమిషాల హాల్టును ఏర్పాటు చే సినట్లు గుంటూరు రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు.
Advertisement
Advertisement