బైబిల్ మిషన్‌కు ప్రత్యేక రైళ‍్లు
-
ప్రత్యేక రైళ్లు, రెగ్యులర్ ప్యాసింజర్లకు అదనపు బోగీలు
-
విజయవాడ వరకు వచ్చే కొన్ని రైళ్లు గుంటూరు వరకు పొడిగింపు
-
ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు నాగార్జున నగర్ స్టేషన్‌లో హాల్ట్
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ ఎదుట నాగార్జున నగర్‌లో జనవరి 26 నుంచి 29 వరకు జరిగే బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చే భక్తులకు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నం: 07223 కాకినాడ– గుంటూరు ప్రత్యేక ప్యాసింజర్ రైలు జనవరి 26 తేదీన కాకినాడలో 05.30కి బయలు దేరి గుంటూరుకు 12.50కి చేరుకుంటుందని తెలిపారు. ట్రైన్ నం: 07224 గుంటూరు – కాకినాడ ప్రత్యేక ప్యాసింజర్ రైలు జనవరి 29న గుంటూరులో 13.50కి బయలుదేరి కాకినాడకు మరుసటి రోజు 10.40 కి చేరుకుంటుందని పేర్కొన్నారు. ట్రైన్ నం: 07250 గుంటూరు విజయవాడ ప్రత్యేక ప్యాసింజరు రైలు జనవరి 27, 28 తేదీల్లో గుంటూరులో 11.15కి బయలుదేరి విజయవాడకు 12.15కి చేరుకుంటుందని తెలిపారు. జనవరి 26 నుంచి 29 వరకు ట్రైన్ నం: 57317/57318 మాచర్ల– భీమవరం, గుంటూరు– మాచర్ల, ట్రైన్ నం: 57316 నర్సాపూర్– గుంటూరు, ట్రైన్ నం: 57582/57381 నర్సాపూర్– గుంటూరు – నర్సాపూర్, ట్రైన్ నం: 57327 డోన్– గుంటూరు ప్యాసింజర్ రైళ్లకు రద్దీకి అనుగుణంగా ఒకటి లేదా రెండు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జనవరి 26 నుంచి 29 వరకు ట్రైన్ నం 57226/57225 విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం ప్యాసింజర్, జనవరి 27, 28 తేదీల్లో ట్రైన్ నం: 57232/57231 కాకినాడ పోర్టు విజయవాడ కాకినాడ పోర్టు ప్యాసింజరు, జనవరి 27, 28 తేదీల్లో ట్రైన్ నం : 57272 రాయగఢ్ విజయవాడ ప్యాసింజరు రైలును గుంటూరు వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జనవరి 26 నుంచి 29 వరకు ట్రైన్ నం : 17201/17202 గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు గొల్కొండ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం : 17239/17240 గుంటూరు విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు, విజయవాడ వైపునకు, గుంటూరు వైపునకు ప్రయాణించే అన్ని ప్యాసింజర్ రైళ్లకు నాగార్జున నగర్ రైల్వే హాల్ట్ స్టేషన్‌లో రెండు నిమిషాలు తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైన్ నం : 07434 సికింద్రాబాద్ కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో జనవరి 25 వ తేదీన బయలుదేరి కాకినాడ పోర్టుకు మరుసటి రోజు 05.15కి చేరుకుంటుందని తెలిపారు. ఇది డివిజను పరిధిలో నల్గొండ 21.05/21.06, మిర్యాలగూడ 21.32/21.33, పిడుగురాళ్ల 22.32/22.33, సత్తెనపల్లి 23.07/23.08, గుంటూరు మరుసటి రోజు 00.30/00.35కి వచ్చి బయలుదేరుతుందని తెలిపారు. ట్రైన్ నం : 07435 కాకినాడ టౌన్ సికింద్రాబాద్ ప్రత్యేక రైలు జనవరి 29వ తేదీన కాకినాడ టౌన్‌లో 18.10కి బయలుదేరి సికింద్రాబాద్‌కు మరుసటిరోజు 05.00కి చేరుకుంటుందని తెలిపారు.
ఇది డివిజను పరిధిలో గుంటూరు 23.00/23.05, సత్తెనపల్లి 23.48/23.50, పిడుగురాళ్ల మరుసటిరోజు 00.10/ 00.12, మిర్యాలగూడ 01.10/01.12, నల్గొండ 01.45/01.47కి వచ్చి బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఈ రైలు రిజర్వేషన్ ప్రయాణికుల కోసం రెండు త్రీటైర్ ఏసీ, పది స్లీపర్ కోచ్‌లు, సాధారణ ప్రయాణికుల కోసం రెండు జనరల్, రెండు ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లతో నడుస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు సూచించారు.