ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్‌హెచ్‌ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పదవ రోజు శనివారం కూడా యుద్ధం మొదలై.. విరామంతో కాసేపు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ లోపు విదేశీయులను తరలించే యోచనలో ఉంది ఉక్రెయిన్.
Comments
Please login to add a commentAdd a comment