unhrc
-
వార్ వన్ సైడ్.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
జెనీవా: దాయాది దేశం పాకిస్థాన్‌కు మరోసారి భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలనే పాక్ ప్లాన్‌ను భారత్ చాకచక్యంగా తిప్పి కొట్టింది. దీంతో, పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. జమ్మూకశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధిచెప్పింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కాగా, జెనీవా వేదికగా ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్, తుర్కియే లేవనెత్తాయి. భారత్‌లో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరుపారేసుకున్నాయి. దీంతో, వారి ఆరోపణలకు భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ‘రైట్ టు రిప్లై’ అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమ సింగ్.. పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్ ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేం చెప్పేది ఒక్కటే.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదు అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో తుర్కియేపైనా భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌కు మద్దతిస్తూ తుర్కియే కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేయడం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నా’మని అన్నారు. 🇮🇳 India exercises Right of Reply at #HRC55, First Secretary Anupama Singh, says, "The entire Union Territories of Jammu and Kashmir and Ladakh is an integral and inalienable part of India".pic.twitter.com/vk6wXezfOO — All India Radio News (@airnewsalerts) February 29, 2024 ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనార్టీలకు దారుణంగా కాల్చివేశారు. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారు మానవహక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాక్ తడిసిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ఆ ప్రభుత్వం విఫలమైంది. అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కౌంటరిచ్చారు. -
Ashwini KP: చరిత్ర సృష్టించిన అశ్విని.. మానవహక్కుల దూతగా..
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. తొలి దళిత యువతి ‘స్త్రీగా, దళిత స్త్రీగా నేను ఈ అవకాశం పొందడం చాలా ప్రాముఖ్యమైన సంగతి’ అంటోంది అశ్విని. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశాలలో కీలకమైన నిర్ణయం వెలువడింది. జాతి వివక్షను నివేదించేందుకు స్వతంత్య్ర నిపుణురాలిగా (ప్రత్యేక దూతగా) మొదటిసారి ఒక భారతీయురాలి ఎంపిక జరిగింది. బెంగళూరులో పొలిటికల్ సైన్స్ బోధించే అధ్యాపకురాలు, దళిత్ యాక్టివిస్టు అశ్విని కె.పి.ని కౌన్సిల్‌లోని 47 మంది సభ్యుల బాడీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. ఈ పదవిలోకి వచ్చిన తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా, తొలి దళితురాలిగా ఆ మేరకు అశ్విని చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ పదవిలో జాంబియాకు చెందిన మహిళ ఇ.తెందాయి ఉంది. అమెరికాలో ఇటీవల భారతీయ సముదాయంలో ‘కుల వివక్ష’ ధోరణి ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నిర్వహించే కార్యకలాపాలను నమోదు చేయడం, ఆయా దేశాలలో నెలకొన్న అసహనం, జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల అకారణ ద్వేషం స్థూలంగా, దేశాన్ని బట్టి ఏ విధంగా ఉన్నాయో కౌన్సిల్‌కు నివేదించడం అశ్విని బాధ్యతలుగా ఉంటాయి. ఈ పదవిలో అశ్విని మూడేళ్లు ఉంటుంది. ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ.. ‘భారతదేశంలో అంబేద్కర్ కులవివక్షని, జాతి వివక్షని ఎలా ఎదుర్కొవాలో చెప్పారు. మన దేశంలో అంటరానితనం ఎంతటి ఘోరమైన కులవివక్షకు కారణమైందో తెలుసు. అది చూసే అంబేద్కర్ ప్రతిఘటన మార్గాలు చెప్పారు. అయితే అవి భారతదేశానికే కాదు... ప్రపంచం మొత్తానికి ఉపయోగపడతాయి. జాతి వివక్ష గురించి నాకున్న దృష్టికోణం ఆయన నుంచి పొందినదే. ఒక స్త్రీగా, దళితురాలిగా కూడా నాకు ఈ పదవి రావడం వల్ల మార్జినలైజ్డ్ సమూహాలు ఎదుర్కొనే వివక్షను మరింత బాగా అర్థం చేసుకునే వీలు ఉంది.’ ‘భారత్– నేపాల్‌లలో దళిత మానవ హక్కులు ఎలా ఉన్నాయో అన్న అంశం మీద జె.ఎన్.యూ.లో నేను పీహెచ్డీ చేశాను. ఆ సమయంలో ఎందరో దళిత యాక్టివిస్టులను కలిశాను. వారంతా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివిధ వేదికలలో పని చేస్తున్నారు. అలాగే నేను ఆమ్నెస్టీకి చెందిన సీనియర్ బృందాలతో కలిసి పని చేశాను. ఆ పనిలో భాగంగా ఛత్తిస్‌గఢ్, ఒడిశాలలోని ఆదివాసుల హక్కుల హరణం తెలుసుకున్నాను. ఆదివాసులు, దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ అవగాహనలన్నీ ఇప్పుడు వచ్చిన ఈ పదవిని మరింత అర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి’ ‘రకరకాల వివక్షల వల్ల కోట్లాది మంది బాధ పడుతున్నారు. ఈ వివక్షలను దాటి ముందుకు నడవడానికి ప్రతి ఒక్కరూ చేతనైన చైతన్యం కలిగించాలి. కల్పించుకోవాలి’. చదవండి: అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కొన్ని నియమాలు.. Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
యూఎన్‌లో చైనాకు వ్యతిరేకంగా ఓటుకు దూరం...వివరణ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించగా భారత్ గైర్హాజరైంది. ఐతే భారత్ తానెందుకు దూరంగా ఉందో వివరణ ఇచ్చింది. ఈ ఓటింగ్ అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు ఎప్పటికి సహాయకారి కాదని స్పష్టం చేసింది. అలాగే జిన్జియాంగ్లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....అన్ని మానవహక్కులను సమర్థించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఓటు అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు సహాయకారి కాదని , భారత్ కేవలం దీర్ఘకాలికి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహిరిస్తుంది. భారత్ ఎప్పుడు ఇలాంటి విషయాల్లో సంభాషిచేందుకు ఇష్టపడుతుంది. అంతేకాదు జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేయగలం. ప్రజల మానవ హక్కులు గౌరవింపబడటమే కాకుండా హామీ ఇవ్వాలి. సంబంధిత పక్షం దీన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాం. అని అన్నారు. అలాగే భారత్‌లా చైనాకు వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా 11 దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎన్హెచ్ఆర్సీలో తీర్మానానికి అనుకూలంగా 17 మంది సభ్యులు ఓటు వేయగా చైనా, పాకిస్తాన్, నేపాల్‌తో సహ 19 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐతే భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్‌తో 11 దేశాలు గైర్హాజరయ్యారు. (చదవండి: యూకే మంత్రి వీసా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్) -
మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీగిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది. ఈ విషయంపై స్పందిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా.. ఏది కరెక్ట్, ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా అని నిలదీశారు. ఐరాస ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Will the PM Modi saheb explain the reason for India’s decision to help China out in the UNHRC on the Uighur issue by choosing to abstain from an important vote? Is he so scared of offending Xi Jingping, whom he met 18 times, that India can’t speak for what is right? https://t.co/TJNy3Ffn2w — Asaduddin Owaisi (@asadowaisi) October 7, 2022 కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామ మహమద్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. మన భూమిని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలకు ఖండించడానికి గానీ మోదీ సిద్ధంగా లేరు, చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. India abstains on draft resolution at UNHRC for a debate on human rights violations of Uyghurs in China Far from holding China accountable for stealing our land, PM Modi can't even bring himself to condemn China on human right violations. Why is @narendramodi so scared of China! — Dr. Shama Mohamed (@drshamamohd) October 6, 2022 ఐరాస మానవహక్కుల కమిషన్ తీర్మానంపై జరిగిన ఓటింగ్ ఫలితం చైనాకు అనుకూలంగా వచ్చింది. 19 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
రష్యాకు హ్యాండ్ ఇచ్చిన భారత్.. పుతిన్ రెస్పాన్స్‌పై టెన్షన్!
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి కారణంగా రష్యాకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రష్యాపై పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. తాజాగా ప్రపంచ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే, ఈ ఓటింగ్ వేళ భారత్ మరోసారి ఆచితూచి వ్యవహరించింది. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే, ఓటింగ్‌కు ముందు భారత్‌తో రష్యా మాట్లాడింది. తమకు అనుకూలంగా ఉండాలని సూచించింది. అయిన్పటికీ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఓటింగ్‌పై యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్పందిస్తూ.. ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన నాటి నుంచి భారతదేశం శాంతి, చర్చలు, దౌత్యం కోసం నిలబడింది. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను తీసుకోవడం కారణంగా ఎలాంటి పరిష్కారం ఉండదని మేము నమ్ముతున్నాము. ఇండియా ఎప్పుడూ శాంతి పక్షమే ఉంటుంది. హింసను కోరుకోదని స్పష్టం చేశారు. BREAKING: U.N. General Assembly passes resolution to suspend Russia from Human Rights Council, in response to Russian forces' alleged killings of civilians in Ukraine. The vote passed with 93 countries voting in favor, 24 voting against and 58 abstaining. https://t.co/WVCaEajSgx pic.twitter.com/6QOY4nVJCW — ABC News Politics (@ABCPolitics) April 7, 2022 రష్యాకు చైనా అనుకూలంగా ఓటు వేయగా.. బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాక్, మలేషియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ.. దూరంగా ఉన్నాయి. దీంతో రష్యా స్పందిస్తూ.. ఓటింగ్‌లో దూరంగా ఉన్న దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. ఓటింగ్‌కు దూరంగా ఉండటం అంటే తమ శత్రుత్వాన్ని పెంచుకోవడమేనని పేర్కొంది. ఇది భవిష్యత్తులో దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. @VivianBala I don't see the logic in publicising your sanctions against #Russia and yet abstain from voting to kick them out of @UN_HRC. This does not show any sincerity with #UkraineUnderAttack. In fact the majority of @ASEAN have been a complete let down. Embarrassing pic.twitter.com/WK4kvoEvdp — lone🐺wolf🇲🇲🇺🇦 (@solo7lupo) April 8, 2022 -
యుద్దానికి బ్రేక్ ఇచ్చిన రష్యా..
-
ఉక్రెయిన్‌లో యుద్ధ విరామం!
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్హెచ్ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పదవ రోజు శనివారం కూడా యుద్ధం మొదలై.. విరామంతో కాసేపు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ లోపు విదేశీయులను తరలించే యోచనలో ఉంది ఉక్రెయిన్. -
ఫ్రెండ్లీగా రండి.. దాని కోసమైతే రాకండి: చైనా
బీజింగ్: మైనార్టీ దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టేందుకు సహకరించాలని అంతార్జతీయ మానవ హక్కుల సంఘం (యూఎన్హెచ్ఆర్సీ) చేసిన వినతిని చైనా తిరస్కరించింది. ఈ అంశంపై యూఎన్హెచ్ఆర్సీకి చైనా ఘటాగా బదులిచ్చింది. కాగా జింగ్జియాంగ్లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించింది. అదే క్రమంలో తీవ్ర వాదాన్ని అణిచివేసే పేరిట అక్కడి ప్రజల భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటోంది. ఈ చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై చైనా అధికారి మాట్లాడుతూ.. యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్ జిన్జియాంగ్ సందర్శించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ పర్యటన ద్వైపాక్షిక మార్పిడి, సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కూడిన.. స్నేహపూర్వక పర్యటనగా ఉండాలి తప్ప, దార్యాప్తు వంకతో తమ దేశానికి రావొద్దని స్పష్టం చేశారు. ఈ సమస్య ద్వారా చైనాలో రాజకీయ సంక్షోభం సృష్టించి, మాపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇక జిన్జియాంగ్ జరుగుతున్న హింసాత్మక దాడులకు ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ కారణమని తెలిపారు. కాగా ఉయ్గుర్ల మరణాలపై ఇరాస మానవ హక్కుల మండలిలో 42 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జిన్జియాంగ్ ముస్లిం ఉయ్గుర్లపై జరిగిన మారణహోమంపై దర్యాప్తు జరపాలని యూఎన్హెచ్ఆర్సీ పై పలు దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...
జెనీవాలో బుధవారం మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మండలి అది. అత్యంత కీలకమైన సమావేశం. దేశాలన్నీ బాధ్యతగా హాజరవుతాయి. మానవ హక్కుల గురించి మాట్లాడతాయి. మనమూ వెళ్లాం. మన పొరుగున ఉండే పాకిస్తాన్ కూడా వచ్చింది. ఎప్పటిలా జమ్మూ–కశ్మీర్లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టింది! మాట్లాడినంతా మాట్లాడనిచ్చి, మన దౌత్య అధికారి సీమా పూజాని మైక్ అందుకున్నారు. ‘నీకు సంబంధం లేని విషయం లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. ‘ఆగస్టులో జరిగిన సదస్సులో కూడా ఇలాగే ఎక్కువ చేశావు’ అని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు. ఆ దేశం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో మండలి సభ్యులందరి దృష్టికి తెచ్చారు. ఆ యువ ఐ.ఎఫ్.ఎస్. ఇచ్చిన ‘రైట్ ఆఫ్ రిప్లయ్’కి దేశంలో ఇప్పుడు ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ∙∙ సీమా పూజాని ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున మాట్లాడే హక్కు కలిగిన సెకెండ్ సెక్రెటరీ. దౌత్య అధికారి. ఆమె ఇచ్చిన సమాధానం గానీ, చేసిన ప్రకటన గానీ భారత్ తరఫున అధికారికం అవుతుంది. అందుకే హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన విధానానికి దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని ఆ దేశానికి చెప్పడమే. సీమను తగిన పోస్ట్‌లోనే నియమించుకుంది భారత్. 2014 సివిల్స్‌లో ఆలిండియా ర్యాంకర్ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంచుకున్నారు. అప్పటికి ఆమె ‘లా’ పూర్తయింది. ‘లా’ లోనే పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక బ్యూసెరియస్ లా స్కూల్ చేరుదామని అనుకుని కూడా.. సివిల్స్ సాధించాలనే తన కలలోకి మళ్లీ వెళ్లిపోయారు. రెండో అటెంప్ట్‌తో ఆమె కల నిజమైంది. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్‌లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్నాథ్ పూజానీ రిటైర్డ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. తల్లి గృహిణి. సీమ మొదట ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. ఇంటర్లో సైన్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత మాత్రం ఇంజనీరింగ్ చేయలేదు. ‘లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. మరీ చిన్నప్పుడైతే ఆమెకు వెటరినరీ డాక్టర్ అవాలని ఉండేదట. చివరికి ఆరోగ్యకరమైన దౌత్య సంబంధాలను నెరిపే బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అవసరమైతే మాటకు మాటతో చికిత్స కూడా. సమితి మానవ హక్కుల మండలిలో మొన్న పాకిస్తాన్‌కు ఆమె చేసిన చికిత్స అటువంటిదే. సమితి హక్కుల ‘మండలి’లో సీమ మాటకు మాట -
పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ)లో దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడింది. ఓ వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూనే.. మరోవైపు బాధితురాలిగా బిల్డప్ ఇస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చే ప్రయత్నం చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెనీవాలో ఐక్యరాజ్య సమితికి భారత మొదటి కార్యదర్శి విమర్ష్ ఆర్యన్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదంపై చర్చ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ తాను బాధితురాలిని అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ మరోవైపు ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. అయితే ఈ వాస్తవం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మరల్చడానికి ఇలా నాటకాలు ఆడుతుంది’ అంటూ విమర్శించారు. అంతేకాక భారతదేశంలో మైనారిటీలకు రక్షణ కరువు అవుతుంది అంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆర్యన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాయాది దేశం మహిళలు, పిల్లలు, హిందువులు, జర్నలిస్ట్‌ల విషయంలో ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో ఉదాహరణలతో సహా వెల్లడించారు. (చదవండి: బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!) ఆసిఫ్ పెర్వైజ్ అనే క్రైస్తవ వ్యక్తికి మరణ శిక్ష విధించడం.. దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో హిందూ మహిణ పార్యా కుమారిని అపహరించి మతం మార్చడం.. బిలాల్ ఫారూకి వంటి నిజాయతీ కలిగిన జర్నలిస్ట్‌ని పాక్ సైన్యం తీవ్రంగా హింసించడం వంటి ఉదాహరణలను వెల్లడించారు ఆర్యన్. ఇంత క్రూరంగా ప్రవర్తించే పాకిస్తాన్, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశానికి హితబోధ చేయడం.. ఇండియాలో మైనారిటీల గురించి ఆందోళన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత దేశాన్ని అప్రదిష్ట పాలు చేయడం కోసం ఎన్ని కల్పిత కథలు చెప్పినా.. పాక్ నుంచి ప్రాణ భయంతో పారిపోతున్న మైనారిటీలు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నారని.. దీన్ని అంతర్జాతీయ వేదికలు మార్చబోవని ఆర్యన్ స్పష్టం చేశారు. -
‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’
జెనీవా/న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా ఉగ్రవాదులు సోషల్ మీడియాలో దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) 45వ సమావేశాల్లో భారత్ పేర్కొంది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత మిషన్ కార్యదర్శి పవన్ బాధే ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలు, యువతను తమ శ్రేణుల్లో నియమించుకునే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. భద్రతా దళాలు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు ఉగ్రవాదులు వీరిని ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. ఉగ్రవాదం సామాజికార్థిక అభివృద్ధికి పెనుముప్పుగా పరిణమించిందని అన్నారు. ఉగ్రవాదం స్వేచ్ఛాయుత ఆలోచనకు, భావప్రకటనపై దాడిగా పవన్ పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ తన సొంత ప్రజలతో పాటు అది భారత్ నుంచి ఆక్రమించిన ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విమర్శ్ ఆర్యన్ యూఎన్హెచ్ఆర్సీ వేదికగా బదులిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాకిస్తాన్ అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని, మానవ హక్కుల తీర్మానాలను తుంగలో తొక్కిందని అన్నారు. చదవండి : భారత ఆర్మీకి భయపడి ఏడ్చిన చైనా జవాన్లు! -
ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో సీఏఏ వ్యతిరేక వాదనలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఏ దేశానికీ చెందని వారిని పౌరులుగా గుర్తించేందుకు ఈ చట్టం చేశాం. దేశం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పౌరసత్వంపై దేశానికో నిర్వచనం, విధానం ఉంటాయి. ప్రపంచంలో అందరినీ స్వాగతించే దేశమేదైనా ఉంటే చూపండి. అలా ఎవరూ చూపలేరు. అమెరికాను చూడండి. యూరోపియన్లను చూడండి. యూరప్‌లో అయితే ఒక్కో దేశానికీ ఒక్కో విధానం ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఒప్పించలేకపోయిందా అన్న ప్రశ్నకు ఆయన.. బ్రస్సెల్స్‌లో 27 దేశాల మంత్రులతో జరిగిన సమావేశంలో సీఏఏపై వాస్తవాలను వివరించానన్నారు. ఈ విషయంలో భారత్ తన స్నేహితులను కోల్పోతుందా అన్న ప్రశ్నపై.. వాస్తవ మిత్రులెవరో కూడా ఇప్పుడే తెలిసే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారత్. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. గతంలో మాదిరిగా నేడు రక్షణాత్మకంగా వ్యవహరించ లేదు. ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనాల్సిందే. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను కొందరు అంగీకరించవచ్చు. మరికొందరు అంగీకరించక పోవచ్చు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టలేం. ఇందుకు తగినట్లుగా ఆయా దేశాలతో మనం వ్యవహారం సాగించాల్సి ఉంది’అని తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యూఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఆయన స్పందిస్తూ.. గతంలోనూ యూఎన్హెచ్ఆర్సీ ఇటువంటి తప్పుడు అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. కశ్మీర్లో పొరుగుదేశం ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై యూఎన్హెచ్ఆర్సీ ఏమీ చేయలేకపోయింది’ అని పేర్కొన్నారు. -
పేరు చెప్పరు.. ఊరూ చెప్పరు..!
సాక్షి, హైదరాబాద్ : పాక్ చెరలో చిక్కిన ప్రశాంత్‌ను భారత్‌కు తీసుకురావాలని అతడి తండ్రి బాబూరావు వేడుకుంటున్నారు. సైబర్ క్రైమ్‌లో చిక్కి, అక్రమంగా వచ్చినట్లు తేలి చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు విషయాలు అటుంచితే... పాస్‌పోర్ట్, వీసా సహా ఎలాంటి ధ్రువీకరణపత్రాలు లేకుండా సిటీలో అక్రమంగా నివసిస్తూ చిక్కిన సోమాలియన్ల కథ మరోలా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్లో ఉన్న ఈ ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లేదేలేదని మొండికేస్తున్నారు. తమ వివరాలు చెప్పకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు చేపడతారు. అవి పూర్తయ్యే వరకు అధీకృత ప్రదేశం/ప్రాంతంలో వారిని నిర్భంధించి ఉంచుతారు. దీన్నే పారిభాషికంగా డిపోర్టేషన్ సెంటర్‌గా పిలుస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. రాష్ట్రంలో ఎక్కడ చిక్కిన వారినైనా అక్కడే ఉంచి డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టేవారు. రాష్ట్ర విభజన అనంతరం చాలా కాలం పాటు తెలంగాణలో ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేయలేదు. ఆరు నెలల క్రితమే హైదరాబాద్ సీసీఎస్‌ను డిపోర్టేషన్ సెంటర్‌గా నిర్దేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి నుంచి నగరంలో పట్టుబడిన విదేశీయులను ఇక్కడే ఉంచుతున్నారు. రెండు నెలల క్రితం నగర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న ఎనిమిది మంది నల్లజాతీయులకు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని వెంటనే ఆయా దేశాలకు పంపడం సాధ్యం కావట్లేదు. చిక్కిన వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సహకారంతోనే డిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు డిపోర్టు కావాల్సిన వారిని సీసీఎస్ ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్లోనే ఉంచుతున్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో నైజీరియన్, సోమాలియా, సూడన్ దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్‌కు సిద్దంగా ఉన్నారు. మిగిలిన వారితో ఇబ్బంది లేకపోయినా సోమాలియా దేశానికి చెందిన వారు మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాము తిరిగి వెళితే బతకలేని పరిస్థితి ఉందని చెబుతూ తమ పూర్తి వివరాలు చెప్పడానికీ ఇష్టపడటం లేదు. ఆ వివరాలు లేనిదే ఆయా రాయబార కార్యాలయాలను సంప్రదించడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ఈ సోమాలియన్ల విషయంలో అధికారులు యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. వారికి లేఖ రాయడం ద్వారా ఆ విభాగం ఎంపిక చేసిన దేశాలకు శరణార్ధులుగా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిపోర్టేషన్ సెంటర్లో ఉన్న వారిలో సోమాలియాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుం బతో సహా అక్రమంగా వలసవచ్చి బెంగుళూరులో ఉంటున్నాడు. ఇటీవల నగరానికి వచ్చి తన స్నేహితుల వద్ద ఉండగా పోలీసులకు చిక్కాడు. తమ దేశానికి వెళ్లడానికి విముఖత చూపుతున్న ఇతడు కనీసం తన కుటు ంబం వివరాలు చెప్పట్లేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో అతడి కుటుంబం వివరాలు తెలుసుకోవడానికి ఆ దేశ ఎంబసీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. -
పరువు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మరోసారి అంతర్జాతీయంగా అభాసుపాలయ్యారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడంపై రగిలిపోతున్న ఇమ్రాన్, తప్పుడు ట్వీట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఐక్యరాజ్యసమితిలోని మానవహక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ)లో 47 సభ్యదేశాలు మాత్రమే ఉండగా, ఏకంగా 58 దేశాలు తమకు మద్దతు ఇచ్చాయని ప్రకటించి నవ్వులపాలయ్యారు. ఏం జరిగిందంటే.. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూఎన్హెచ్ఆర్సీ సమావేశమైంది. ఇందుకు మొత్తం 47 సభ్యదేశాలూ హాజరయ్యాయి. ఈ సందర్భంగా కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఆరోపించగా, భారత్ తిప్పికొట్టింది. యూఎన్హెచ్ఆర్సీలో తమ తీర్మానానికి 58 సభ్యదేశాలు మద్దతిచ్చాయని, ఆయా దేశాలకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే, యూఎన్హెచ్ఆర్సీ మొత్తం 47 దేశాలు మాత్రమే. ఇమ్రాన్ ట్వీట్‌పై సామాజికమాధ్యమాల్లో జోకులమీద జోకులు పేలుతున్నాయి. ఇమ్రాన్ భూగోళశాస్త్రంతో పాటు గణితం కూడా నేర్చుకుంటే మంచిదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. -
అయ్యో ఇమ్రాన్.. ఉన్నది 47 దేశాలే కదా!?
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ జరిగిన నాటి నుంచి దాయాది దేశం చేస్తోన్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఈ విషయంలో ప్రపంచ దేశాలేవి పాక్‌కు మద్దతివ్వడం లేదు. మరోపక్క జమ్మూకశ్మీర్ అంశంలో పాక్ ప్రజలు కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లిన చందంగా కశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌నే విశ్వసిస్తున్నాయంటూ పాక్ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు ఇమ్రాన్‌ను మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. వీటికి తోడు ఇమ్రాన్ ఖాన్ సొంత పైత్యం మరిన్ని వివాదాలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను అడ్డంగా బుక్ చేశాయి. మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) సమావేశంలో 58 దేశాలు కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యలను వ్యతిరేకించాయని పేర్కొని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్. ఇమ్రాన్ ఖాన్ గురువారం ‘ఈ నెల 10న జెనివాలో జరిగిన యూఎన్హెచ్ఆర్సీ సమావేశంలో ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించాం. భారత ప్రభుత్వం కశ్మీర్లో నిర్భందకాండను ఎత్తివేయాలని డిమాండ్ చేశాం. అక్కడి ప్రజలపై ఆంక్షలు నిలిపివేయాలిన.. వారి హక్కులను పరిరక్షించాలని కోరాం. పాక్ వ్యాఖ్యలను మిగతా దేశాలు సమర్థించాయి. అంతేకాక యూఎన్హెచ్ఆర్సీలో ఉన్న 58 దేశాలు పాక్‌కే మద్దతుగా నిలిచాయి’ అంటూ ట్విట్ చేసి మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు ఇమ్రాన్. ఎందుకంటే యూఎన్హెచ్ఆర్సీలో ఉన్నదే 47 దేశాలు. అలాంటిది 58 దేశాలు పాక్‌కు మద్దతెలా ఇచ్చాయంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ‘ఇమ్రాన్ కొత్తగా మరో 11 దేశాలను కనిపెట్టాడు’.. ‘ఇమ్రాన్ జాగ్రఫీలోనే అనుకున్నాం లెక్కల్లో కూడా పూరేనా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. -
మహ్మద్ నషీద్‌కు ఊరట
జెనీవా: మాల్దీవులు మాజీ ఆధ్యక్షుడు మహ్మద్ నషీద్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఊరటనిచ్చింది. నషీద్‌పై 16 సంవత్సరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని యూఎన్‌హెచ్‌ఆర్‌సి తెలిపింది. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారానికి దూరమైన నషీద్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. సోమవారం సమావేశమైన సివిల్, రాజకీయ హక్కుల స్వతంత్ర కమిటీ మాజీ అధ్యక్షుడిపై ఆరోపణలు అస్పష్టంగా ఉన్నందున ఆయనపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ... తదుపరి ఎన్నికల్లో పోటికి అనుమతినిచ్చింది. ‘రాజకీయ హక్కులు కేవలం అసాధారణమైన, నిర్థిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే నియంత్రించబడతాయి. న్యాయ విచారణ పేరిట నషీద్ రాజకీయ హక్కులను నియంత్రించడం సబబు కాదు’ అని కమిటీ సభ్యుడు సారా క్లెవ్యాండ్ ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్ 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తన అనారోగ్య పరిస్థితుల రీత్యా వైద్య సేవల కోసం ప్రస్తుతం బ్రిటన్‌లో చికిత్స పొందుతున్నారు. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్ నషీద్ కావడం విశేషం. కాగా ప్రస్తుత ఆధ్యక్షుడు అబ్దుల్ యామీన్ మాల్దీవులులో అత్యయిక పరిస్థితిని విధించారు. తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలను విడుదల చేయవలసిందిగా అబ్దుల్ యమీన్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రతిపక్ష నేతలను ఆయన జైలులో నిర్భంధించిన విషయం తెలిసిందే. -
తన తప్పుకు తనే బలౌతోంది: భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో టెర్రరిస్టు గ్రూపులను పెంచిపోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే టెర్రరిజం బెడదతో వణికిపోతోందని యూఎన్ మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో భారతదేశ శాశ్వత ప్రతినిధి అజిత్ కుమార్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాక్‌లోనే పుట్టి పెరిగారని అన్నారు. యూఎన్ భద్రతా కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా పీఓకేను పాక్ ఖాళీ చేయడం లేదని మరోమారు గుర్తుచేశారు. మానవహక్కుల ఉల్లంఘనలో మొదటిస్ధానం ఉగ్రవాదానిదే అని చెప్పిన అజిత్‌కుమార్.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫక్తూక్వా, మరికొన్ని గిరిజనప్రాంతాల్లోని ప్రజలే అధికంగా ఉగ్రపీడితులుగా ఉన్నారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి ప్రధాన కారణం పాకిస్తానేనని చెప్పారు. కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్ కరెన్సీ, మిలటరీ సామగ్రి తదితర వస్తువులను భారత్‌కు పలు మార్లు దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఐరాస హక్కుల సలహాదారుగా భారతీయుడు
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) ఆధ్వర్యంలో ‘మానవ హక్కులు, బహుళజాతి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు’ అనే అంశంపై పనిచేస్తున్న బృందానికి సలహాదారుగా భారతీయ సంతతి విద్యావేత్త నియమితులయ్యారు. ఆసియా-పసిఫిక్ ప్రతినిధిగా సూర్య దేవాను యూన్హెచ్ఆర్సీ నియమించింది. దేవా ప్రస్తుతం హాంగ్‌కాంగ్‌లోని స్కూల్ ఆఫ్ లా ఆఫ్ సిటీ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్. -
లంకపై శాఖాచంక్రమణం!
సంపాదకీయం శ్రీలంక సైన్యం అక్కడి తమిళులను ఊచకోత కోసిన వైనంపై తరచు వెల్లడయ్యే హృదయవిదారక దృశ్యాలు ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తాయి. నిరాయుధులైన పౌరులను నగ్నంగా కూర్చోబెట్టి కాల్చిచంపడం, బందీగా పట్టుబడిన తమిళ టైగర్ల అధినేత ప్రభాకరన్ కుమారుడు పన్నెండేళ్ల పసివాడు బాలచంద్రన్‌ను అమానుషంగా హతమార్చడం, యాంకర్‌గా పనిచేసిన యువతిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని కాల్చిచంపడంవంటి ఉదంతాలన్నీ వీడియోల్లో రికార్డయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ దర్యాప్తునకు వీలుకల్పించే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు మన దేశం గైర్హాజరవడం ఆశ్చర్యం కలిగించే పరిణామం. లంక పేరెత్తితే అంతెత్తున లేచే ద్రవిడ పార్టీలు కూడా ఈసారి మౌనంగా మిగిలిపోవడం అంతకన్నా దిగ్భ్రాంతికరం. అయిదేళ్లక్రితం ఎల్టీటీఈ లక్ష్యంగా శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అది అంతర్యుద్ధంగా మారి అక్కడున్న సామాన్య తమిళులు లక్షలాదిమంది చెట్టుకొకరు, పుట్టకొకరై ప్రాణాలు అరచేతబట్టుకుని తమిళనాడు చేరారు. మార్గమధ్యంలో ఎందరెందరో హత్యలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఉగ్రవాదంపై పోరాటమని చెప్పుకున్నా లంక సైన్యం సాగించిందంతా నరమేథమే. ఆ నరమేథంపై ఎన్ని సాక్ష్యాలు లభ్యమైనా లంక సర్కారు బుకాయిస్తూ వస్తోంది. అయితే, తమిళుల ఊచకోత సాగుతున్నప్పుడుగానీ, అది పూర్తయ్యాకగానీ ప్రధాన ద్రవిడ పార్టీలు నోరెత్తలేదు. కానీ, ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆ పార్టీలన్నీ పోటీపడి లంక తమిళుల హక్కుల పరిరక్షణలో తమను మించినవారు లేరన్న అభిప్రాయం కలగజేయడానికి ప్రయత్నించాయి. తమిళనాట జరిగే ఈ తంతుకు అనుగుణంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వానికీ అలవాటైపోయింది. అందువల్లే తమిళనాడులో ఎలాంటి నిరసనలూ వ్యక్తంకాని 2009లో మానవ హక్కుల మండలిలో లంకను మన దేశం బేషరతుగా సమర్థించింది. అటు తర్వాత ద్రవిడ పార్టీలన్నీ లంక అమానుషాలపై నిప్పులు చెరిగి, ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చినప్పుడు వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే మన దేశం 2009నాటి విధానానికి పూర్తి భిన్నమైన వైఖరిని తీసుకుని 2012, 2013 లలో లంకకు వ్యతిరేకంగా ఓటేసింది. ఇప్పుడు లంకపై మళ్లీ మానవహక్కుల మండలిలో తీర్మానం రాబోతున్నదని తెలిసినా ఎన్నికల్లో పీకల్లోతు మునిగిపోవడంవల్ల కావొచ్చు...ద్రవిడ పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు తమిళనాడు పార్టీల తీరే కాదు...అంతర్జాతీయంగా అమెరికా వైఖరి కూడా అలాగే ఉన్నది. ఎల్టీటీఈపై యుద్ధం పేరిట లంక సైన్యాలు సాగిస్తున్న అకృత్యాల గురించి పూర్తి సమాచారం ఉన్నా ఏ దశలోనూ అమెరికా జోక్యం చేసుకోలేదు. తమకు సైతం తలనొప్పిగా తయారైన ‘ఉగ్రవాది’ ప్రభాకరన్, ఆయన నేతృత్వంలోని ఎల్టీటీఈ ముగిసిపోతుంటే ‘అనవసరం’గా మాట్లాడటం ఎందుకని మిన్నకుండిపోయింది. అంతా పూర్తయ్యాక ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి పావులు కదిపింది. మానవ హక్కుల చాంపియన్‌గా అవతారమెత్తింది. అందులో భాగంగానే లంకకు వ్యతిరేకంగా ఈ అయిదేళ్లనుంచీ తీర్మానాలు తీసుకువస్తున్నది. అందులో అమెరికాకు ప్రయోజనాలున్నంత మాత్రాన తీర్మానాన్ని వ్యతిరేకించవలసిన అవసరమేమీ లేదు. గురువారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 23 దేశాలు ప్రతికూలంగా 12 దేశాలు వ్యవహరించాయి. మన దేశంతోపాటు మరో 12 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానం గత తీర్మానాల తరహాలో కాకుండా ఒక దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేదిగా, అనుచితమైన తరహాలో ఉన్నదని మన దేశం చెబుతోంది. అందువల్లే ఈసారి గైర్హాజరు కావలసి వచ్చిందని సంజాయిషీ ఇస్తోంది. నిజమే, గతంలో తీర్మానాలు మానవహక్కుల ఉల్లంఘనకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని లంక అధ్యక్షుడు రాజపక్సేను కోరడంతో సరిపెట్టాయి. ప్రస్తుత తీర్మానం అందుకు భిన్నంగా అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని పిలుపునిచ్చింది. అలాంటి దర్యాప్తు ఏదైనా చివరకు రాజపక్సేను యుద్ధ నేరస్తుడిగా ప్రకటించే స్థితికి చేర్చే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలను ముందే ఊహించడంవల్ల కావొచ్చు...లంకతో చైనా చెలిమి బలపడుతున్న తీరు, దానివల్ల మనకు ఎదురుకాగల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు, యూపీఏ నుంచి వైదొలగుతామని తరచు హెచ్చరించే డీఎంకే ఇప్పుడు మిత్ర పక్షంగా లేకపోవడంవల్ల కావొచ్చు... మన దేశం ఓటింగ్‌కు గైర్హాజరైంది. భారత్ తాజా వైఖరికి కృతజ్ఞతగా శ్రీలంక తన చెరలో ఉన్న భారతీయ జాలర్లను బేషరతుగా విడుదలచేస్తానని ప్రకటించింది. అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు మానవహక్కులను గౌరవించి, వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాయని పరీక్ష పెడితే అత్తెసరు మార్కులైనా తెచ్చుకోగలవి వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో ఉంటాయి. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు తమకు గిట్టనివారిపై ఒత్తిళ్లు తెచ్చేందుకు, వారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి మాత్రమే తోడ్పడుతున్నాయి. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో వీటికి ఇంతకుమించి విలువ ఉండటం లేదు. ఇది చేదు నిజం. అంతమాత్రాన లంక అమానుషాలపై అసలు దర్యాప్తే వద్దనడం సరికాదు. ఒక ప్రాంతంలో లక్షలాదిమంది పౌరులు తమ సైన్యం చేతుల్లోనే ఘోర దురంతాలను చవిచూస్తే...అంతర్జాతీయ సమాజం పాక్షిక దృష్టితోనే దానిపై స్పందించడం ఒక విషాదం. -
లంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు
జెనీవా: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చార్సీ)లో భారత్ శ్రీలంక మెచ్చే నిర్ణయం తీసుకుంది. లంక మానవ హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఆ దేశానికి వ్యతిరేకంగా అమెరికా మద్దతుతో గురువారం యూఎన్‌హెచ్చార్సీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైంది. ఆచరణసాధ్యం కాని ఈ తీర్మానం లంక సార్వభౌమత్వాన్ని తక్కువ చేసి చూపేలా ఉందని, దర్యాప్తులో అంతర్జాతీయ జోక్యాన్ని రుద్దుతోందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి దిలీప్ సిన్హా వివరణ ఇచ్చారు. రాజకీయ సయోధ్యకు శ్రీలంక చేస్తున్న యత్నాలను ఇది పట్టించుకోలేదని, దీని వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయని అన్నారు. భారత్ యూఎన్‌హెచ్చార్సీలో లంకకు వ్యతిరేక తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరవడం ఇదే తొలిసారి. 2009, 2012, 2013ల్లో చేసిన తీర్మానాలకు భారత్ మద్దతిచ్చింది. తాజా తీర్మానం 9 ఓట్ల తేడాతో నెగ్గింది. అనుకూలంగా 23, వ్యతిరేకంగా 12 ఓట్లు పడ్డాయి.