తన తప్పుకు తనే బలౌతోంది: భారత్
తన తప్పుకు తనే బలౌతోంది: భారత్
Published Thu, Mar 2 2017 9:01 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
న్యూఢిల్లీ: భారత్‌లో టెర్రరిస్టు గ్రూపులను పెంచిపోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే టెర్రరిజం బెడదతో వణికిపోతోందని యూఎన్ మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో భారతదేశ శాశ్వత ప్రతినిధి అజిత్ కుమార్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాక్‌లోనే పుట్టి పెరిగారని అన్నారు. యూఎన్ భద్రతా కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా పీఓకేను పాక్ ఖాళీ చేయడం లేదని మరోమారు గుర్తుచేశారు.
మానవహక్కుల ఉల్లంఘనలో మొదటిస్ధానం ఉగ్రవాదానిదే అని చెప్పిన అజిత్‌కుమార్.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫక్తూక్వా, మరికొన్ని గిరిజనప్రాంతాల్లోని ప్రజలే అధికంగా ఉగ్రపీడితులుగా ఉన్నారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి ప్రధాన కారణం పాకిస్తానేనని చెప్పారు. కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్ కరెన్సీ, మిలటరీ సామగ్రి తదితర వస్తువులను భారత్‌కు పలు మార్లు దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Advertisement