న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించగా భారత్ గైర్హాజరైంది. ఐతే భారత్ తానెందుకు దూరంగా ఉందో వివరణ ఇచ్చింది. ఈ ఓటింగ్ అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు ఎప్పటికి సహాయకారి కాదని స్పష్టం చేసింది. అలాగే జిన్‌జియాంగ్‌లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని నొక్కి చెప్పింది.
ఈ మేరకు విదేశాంగ మత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....అన్ని మానవహక్కులను సమర్థించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఓటు అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు సహాయకారి కాదని , భారత్ కేవలం దీర్ఘకాలికి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహిరిస్తుంది. భారత్ ఎప్పుడు ఇలాంటి విషయాల్లో సంభాషిచేందుకు ఇష్టపడుతుంది.
అంతేకాదు జిన్‌జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేయగలం. ప్రజల మానవ హక్కులు గౌరవింపబడటమే కాకుండా హామీ ఇవ్వాలి. సంబంధిత పక్షం దీన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాం. అని అన్నారు. అలాగే భారత్‌లా చైనాకు వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా 11 దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎన్‌హెచ్‌ఆర్సీలో తీర్మానానికి అనుకూలంగా 17 మంది సభ్యులు ఓటు వేయగా చైనా, పాకిస్తాన్, నేపాల్‌తో సహ 19 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐతే భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్‌తో 11 దేశాలు గైర్హాజరయ్యారు.
(చదవండి: యూకే మంత్రి వీసా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment