
ఐరాస హక్కుల సలహాదారుగా భారతీయుడు
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ) ఆధ్వర్యంలో ‘మానవ హక్కులు, బహుళజాతి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు’ అనే అంశంపై పనిచేస్తున్న బృందానికి సలహాదారుగా భారతీయ సంతతి విద్యావేత్త నియమితులయ్యారు. ఆసియా-పసిఫిక్ ప్రతినిధిగా సూర్య దేవాను యూన్‌హెచ్‌ఆర్సీ నియమించింది. దేవా ప్రస్తుతం హాంగ్‌కాంగ్‌లోని స్కూల్ ఆఫ్ లా ఆఫ్ సిటీ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్.